ఆర్టీసీ చార్జీల పెంపుపై మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాస్తారోకో , ధర్నా

ఆర్టీసీ చార్జీల పెంపుపై మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాస్తారోకో , ధర్నా

0
TMedia (Telugu News) :

ఆర్టీసీ చార్జీల పెంపుపై మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాస్తారోకో , ధర్నా
టీ మీడియా ,జూన్ 11,పెద్దపల్లి బ్యూరో :పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కమాన్ వద్ద పెరిగిన ఆర్టీసీ ఛార్జీల పై చీకురాయి రోడ్డు నుంచి ర్యాలీ గా వెళ్లి కమాన్ వద్ద ధర్నా చేపట్టి ఆర్టీసీ బస్సు లో ఉన్న ప్రయాణికులతో మాట్లాడిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మరియు
కాంగ్రెస్ పార్టి నాయకులు.

Also Read : నిఘా నీడలో కేబీఆర్‌ పార్క్‌ వాక్‌వే

పెరిగిన పెట్రోల్‌,డీజిల్‌,గ్యాస్‌,నిత్యావసరాల ధరలతో బ్రతకలేక నానా అవస్థలు పడుతున్న సామాన్య ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు,మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో చేపట్టి నిరసన వక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పక్క ధరలు పెంచుతూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయని మండిపడ్డారు.ఇదిలా ఉంటే ఇప్పటికే విద్యుత్‌ చార్జీలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం మరో సారి ఆర్టీసీ చార్జీలను పెంచడం ఎంత వరకు సమంజసమన్నారు.ఆర్టీసీ నష్టాలను పూడ్చుకోడానికి సాధారణ ప్రజల,విద్యార్థులపై భారం మోపడం సరైంది కాదన్నారు.రాష్ట్రంలో మార్చి నెల నుంచి నేటి వరకు మూడుసార్లు బస్‌చార్జీలు పెంచడం సరికాదన్నారు.

Also Read : రెండో విడుత సింగరేణి ఇళ్ల పట్టాల పంపిణీ

 

మొత్తం బస్‌చార్జీలు,బస్‌పాస్‌ చార్జీలు 150శాతం పెంచారన్నారు.డీజిల్‌సెస్‌ పేరుతో పెంచిన చార్జీలతో దాదాపు బస్‌పాస్ చార్జీలు గతంకన్నా రెట్టింపు ఉన్నాయన్నారు.ఈస్థాయిలో బస్‌పాస్‌ చార్జీలు పెంచితే గ్రామీణ ప్రజలపై మరియు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.ఇప్పటికైనా పెంచిన చార్జీలను తగ్గించాలని లేదంటే పోరాటం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించిన మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube