రచ్చబండ కార్యక్రమంలో శివసేన రెడ్డి

రచ్చబండ కార్యక్రమంలో శివసేన రెడ్డి

1
TMedia (Telugu News) :

రచ్చబండ కార్యక్రమంలో శివసేన రెడ్డి

టీ మీడియా, జూన్ 7, వనపర్తి బ్యూరో : రైతు పడుతున్న బాధలను చూస్తూ రైతులకు భరోసా కల్పిస్తూన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సోమవారం పెబ్బేరు మండలంలోని యాపర్ల, తిప్పాయిపల్లి, గుమ్మడం గ్రామాల సందర్శించారు.
రైతు రచ్చబండ కార్యక్రమంలో పెబ్బేరు మండలం యాపర్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి గ్రామంలో ఉన్న గాంధీ విగ్రహానికి మరియు వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి రైతులను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డికి గుమ్మడం గ్రామ ప్రజలు డబుల్ బెడ్రూమ్ కోసం లబ్ధిదారులతో 60 వేల రూపాయలు తీసుకుని కాంట్రాక్టర్ ఇప్పటికి అక్కడ శిలాఫలకం తప్ప కాంట్రాక్టర్ కనిపించడం లేదని గ్రామ ప్రజలు పలు సమస్యలు శివసేన రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది.

 

Also Read : ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి

మొదటగా గ్రామలలో ఉన్న సమస్య యాపర్ల గ్రామానికి బస్సు లేకపోవడం ద్వారా విద్యార్థులు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నట్టు ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. పలు సమస్యలు తెలుసుకున్న శివసేన రెడ్డి స్వయంగా ఆయన డైరీలో వ్రాసుకుని సమస్యలను పరిష్కరించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తానని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రైతు రచ్చబండ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గంలో రైతు పడుతున్న బాధలను చూస్తూ రైతులకు భరోసా కల్పిస్తూ రైతు రచ్చబండ కార్యక్రమం ద్వారా వరంగల్ రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ ప్రజలు చెబుతున్న సమస్యలను స్వయంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి పెబ్బేరు మండలం యాపర్ల గ్రామం లో ప్రజలకు బస్సు సౌకర్యం లేదని సమస్యను చెప్పగా అప్పటికప్పుడే వనపర్తి బస్ డిపో డిఎంతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చేయండి అని తెలియజేశారు.

Also Read : రోడ్డు విస్తరణ పనుల్లో ఆలస్యం

 

గ్రామాలలో తెలంగాణ వచ్చి కూడా 8సంవత్సరాలు అవుతున్న గ్రామాలకు బస్సు లేక పోవడం చాలా దుర్మార్గం గ్రామాలకు బస్సు లేకుండా తెలంగాణ అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలబెట్టామని చెప్పుకుంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి లేదు డబుల్ బెడ్రూంలు లేవు దళిత బందు లేదు అన్ని బందు పెట్టుకొని నిధులు నింపుకుంటున్న వ్యవసాయ శాఖ మంత్రి మరి మా రైతులుకు మా విద్యార్థులకు ఏం న్యాయం చేసినట్టు మీరు తక్షణమే స్పందించి గుమ్మడం తిప్పాయిపల్లి యాపర్ల ప్రజలకు బస్సు సౌకర్యం కల్పించకపోతే మా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు వనపర్తి నియోజకవర్గం లో మీరు ఎక్కడికి వెళ్ళినా మా కార్యకర్తలు మీ కార్యక్రమాలను అడ్డుకోవడం ఖాయమని హెచ్చరించారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి, వనపర్తి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చీర్ల పాండు సాగర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, శ్రీరంగపురం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు, అనపర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆవుల రమేష్, ఉపాధ్యక్షులు శివ, పెబ్బేరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొనడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube