ఎడవల్లి ఆధ్వర్యంలో రచ్చ బండ

ఎడవల్లి ఆధ్వర్యంలో రచ్చ బండ

1
TMedia (Telugu News) :

ఎడవల్లి ఆధ్వర్యంలో రచ్చ బండ

టి మీడియా,మే 28,పాల్వంచ: పట్టణం లోని పెద్ద బంగరుజాల లో టీపీసీసీసభ్యులు ఎడవల్లి కృష్ణ వరంగల్ రైతు డిక్లరేషన్ ‘ రచ్చబండ ‘ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ఎడవల్లి కృష్ణ మాట్లాడుతూ పాల్వంచ మున్సిపాలిటీ లో భాగమైన ఈ పెద్ద బంగారుజాల కనీస వసతులు లేక మారు మూల పల్లేగా కనిపిస్తుందని,కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే ఈ పెద్ద బంగారుజాలా ను గ్రామపంచాయితీ గ ఏర్పాటు చేస్తానని,రాష్ట్రంలో అన్ని విధాలుగా సంక్షోభంలో ఉన్న రైతుల్లో ధైర్యాన్ని నింపేందుకు ఈ వరంగల్ రైతు డిక్లరేషన్ ను రాహూల్ గాంధీ గారు ప్రకటించారని,2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని..,

Also Read : సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేస్తున్న మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్

గతంలో దేశ వ్యాప్తంగా 70వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని, కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణలో రైతుల గోడు పట్టించుకోవడం లేదని , కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కు కల్పిస్తామని అన్నారు.డబుల్ బెడ్ రూమ్ లు,అందరికీ పెన్షన్ లు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు, తాటి శ్రీను,తాటి సమ్మయ్య,తాటి రమేష్ , లోగాని మురళి,రాము నాయక్,చంద్రగిరి సత్యనారాయణ, యమ్మన భాను తేజ, సెట్టిపల్లి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube