రఘుకు పెరుగుతున్న ప్రజాభిమానం

- కాంగ్రెస్, టిఆర్ఎస్ లు ఓటమి భయాలతో అసత్యప్రచారాలు

0
TMedia (Telugu News) :

రఘుకు పెరుగుతున్న ప్రజాభిమానం

– కాంగ్రెస్, టిఆర్ఎస్ లు ఓటమి భయాలతో అసత్యప్రచారాలు

టి మీడియా, నవంబర్ 24, హుజూర్ నగర్ రూరల్ : హుజూర్ నగర్ నియోజకవర్గం అసెంబ్లీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిల్లుట్ల రఘుకు రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతుంది. ఓజో ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందడం, హుజుర్నగర్ మండలం పలు వార్డుల్లో విస్తృత పర్యటనలు చేయడం, సింహం గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లుట్ల రఘు గడపగడప తిరుగుతూ భరోసానిస్తూ, ప్రజల సమస్యలు వింటూ సింహం గుర్తు ఎమ్మెల్యేగా గెలిచి అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు తీరుస్తానన్నారు.. . ఈ సందర్భంగా పిల్లుట్ల రఘు మాట్లాడుతూ.. నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలకు ఓడిపోతామని భయం పట్టుకుందని, తనపై అమ్ముడుపోయాడని దుష్ప్రచారలు,అసత్య ప్రచారాలు చేస్తున్నారని కుమ్మక్కయి అమ్ముడుపోయే బ్యాచులు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు అని ఎవరేన్ని అసత్య ప్రచారాలు చేసిన సింగల్ గా సింహం గుర్తుతో ఎమ్మెల్యేగా గెలుస్తానన్నారు. తాను స్వచ్ఛమైన ప్రజా సేవలు చేస్తుంటే, అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ, అవినీతి పాలనలు,స్వార్ధ పాలనలు చేస్తూ అల్ప సంతోషం పడుతున్నారన్నారు .

Also Read : ఆప్‌ ప్రభుత్వం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఎందుకు చర్చించకూడదు

నియోజకవర్గంలో తను ప్రజా సేవలు చేస్తుంటే వారు భూకబ్జాలు, రౌడీయిజం, గుండాయిజం, పేకాట రాయలను పోషిస్తున్నారని, ప్రజల ఓట్లతో గెలిచి వారిని పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నారని ఇటువంటి నాయకులకు ప్రజలు అవకాశం ఇవ్వవద్దని ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పి నియోజవర్గం నుంచి తరిమివేయాలని అన్నారు. పనికి మంది ప్రజలు ఇళ్లను కూల్చి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు అని, ప్రజలు కిరాయి ఇళ్లలో బిక్కు బిక్కు మంటూ బతకవలసి వస్తుందని ఇన్ని రోజులు ప్రజల్ని పట్టించుకోకుండా అధికారం అనుభవించి ఎలక్షన్ల దగ్గరకు వచ్చేసరికి మన ఇంటికి వచ్చి ఓట్లు అడిగే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.. పార్టీలు మనలో మనకు గొడవలు పెడతాయని, కేసులు పెడతాయని, పార్టీలను, పార్టీనాయకులను నమ్మవద్దని అన్నారు..పార్టీలకు కొమ్ములు కాసేవారికి ప్రభుత్వ పథకాలు దళిత బంధు,రైతుబంధు అన్ని వారికి అందుతున్నాయని.. సామాన్యుల పరిస్థితి దుర్భరంగా తయారైందని అన్నారు.. తనని సింహం గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే పార్టీలతో సంబంధం లేకుండా స్వచ్ఛమైన ప్రజాపాలనను చేసి చూపెడతానన్నారు, అధికారంలోకి అర్హులైన పేదవారందరికీ కొత్త ఇల్లు నిర్మిస్తానన్నారు.. ఒకరు నియోజకవర్గాన్ని నేనే అభివృద్ధి చేశానని, మరొకరు 3500 కోట్లతో అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని అంత గొప్పగా అభివృద్ధి చేస్తే నియోజవర్గం దుమ్ముదులితో, రోడ్లన్నీ గుంతలతో నిండి ఉన్నాయన్నారు.. నీటి వసతిని రోడ్డులు పట్టించుకోని ఈ నాయకులు ప్రజలను ఎలా పాలిస్తారని పిల్లుట్ల రఘు అన్నారు..

Also Read : అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేస్తాం

నియోజవర్గంలో ప్రజలందరూ మార్పును కోరుకొని నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలను ఆదుకున్న తనను సింహం గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే గెలిపిస్తే ప్రతి కుటుంబానికి అండగా ఉండి ప్రతి ఒక్కరి సమస్య ఊరి సమస్యను తీరుస్తానన్నారు. గత మూడు సంవత్సరాల కాలం నుంచి విద్య వైద్య ఆర్థికంగా ఆదుకుంటూ, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు దీటుగా తాను కూడా సొంత మేనిఫెస్టోను పెట్టానని ఎమ్మెల్యే గెలిచి అధికారంలోకి రాగానే రెండు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క సమస్యను తీరుస్తానన్నారు.ప్రజలందరూ సహకరించి సింహం గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని పిల్లుట్ల రఘు అన్నారు..ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలు, ఎఐఎఫ్ బి పార్టీ సింహం గుర్తు కార్యకర్తలు, రఘు అన్న అభిమానులు, ఓజో ఫౌండేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube