రాజ్‌ప‌థ్‌పై ధ‌ర్నా.. రాహుల్ గాంధీ అరెస్టు

రాజ్‌ప‌థ్‌పై ధ‌ర్నా.. రాహుల్ గాంధీ అరెస్టు

1
TMedia (Telugu News) :

రాజ్‌ప‌థ్‌పై ధ‌ర్నా.. రాహుల్ గాంధీ అరెస్టు
టీ మీడియా, జూలై 26న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న చేప‌ట్టారు. ధ‌ర‌ల పెరుగుద‌ల‌, జీఎస్టీకి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ నేత‌లు ఇవాళ ధ‌ర్నా చేప‌ట్టారు.

Also Read : ఈటెల‌కు ఏ సిద్ధాంతం లేదు

రాజ్‌ప‌థ్‌పై బైఠాయించిన రాహుల్‌ను పోలీసులు లాక్కెళ్లి బ‌స్సులో ఎక్కించారు. సుమారు 30 నిమిషాల పాటు రాజ్‌ప‌థ్‌పై రాహుల్ ధ‌ర్నా చేప‌ట్టారు. దేశంలో పోలీసు రాజ్యం న‌డుస్తోంద‌ని, మోదీ ఓ చ‌క్ర‌వ‌ర్తిలా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు రాహుల్ ఆరోపించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube