రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్ ప్రొఫైల్ పిక్ చూశారా?

రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్ ప్రొఫైల్ పిక్ చూశారా?

1
TMedia (Telugu News) :

రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్ ప్రొఫైల్ పిక్ చూశారా?

టీ మీడియా, ఆగస్టు3, న్యూఢిల్లీ: 75వ స్వాతంత్య్ర ఉత్స‌వాల నేప‌థ్యంలో .. త‌మ త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవాల‌ని ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీ సూచ‌న చేసిన విష‌యం తెలిసిందే. అయితే దానికి త‌గ్గ‌ట్లే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ త‌న ట్విట్ట‌ర్ ప్రొఫైల్ పిక్‌ను మార్చేశారు. జాతీయ జెండాను ప‌ట్టుకున్న దేశ తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ ఫోటోను రాహుల్ గాంధీ త‌న ట్విట్ట‌ర్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు.

 

Also Read : తైవాన్ పండ్లు, చేప‌ల దిగుమ‌తిపై చైనా ఆంక్ష‌లు

 

ఈ త్రివ‌ర్ణ ప‌తాకం దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని, ఇది భార‌తీయుడి గుండె అని రాహుల్ త‌న ట్వీట్‌లో తెలిపారు. ఆజాదీకి అమృత్ మ‌హోత్స‌వ్‌లో భాగంగా హ‌ర్ ఘ‌ర్ తిరంగా సంబ‌రాల‌ను కేంద్రం నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా ఆగ‌స్టు 2వ తేదీ నుంచి 15వ తేదీ వ‌ర‌కు సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా వాడాల‌ని కేంద్రం కోరింది. జాతీయ జెండాను డిజైన్ చేసిన పింగ‌ళి వెంకయ్యకు మంగ‌ళ‌వారం ప్ర‌ధాని మోదీ నివాళి అర్పించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube