స‌రైన అమ్మాయి దొరికితే.. పెళ్లి చేసుకుంటా

- రాహుల్ గాంధీ

0
TMedia (Telugu News) :

స‌రైన అమ్మాయి దొరికితే.. పెళ్లి చేసుకుంటా

– రాహుల్ గాంధీ

టీ మీడియా, జనవరి 23, న్యూఢిల్లీ : స‌రైన అమ్మాయి దొరికితే.. పెళ్లి చేసుకుంటాన‌ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. క‌ర్లీ టెయిల్స్ డిజిట‌ల్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఆ యూట్యూబ్ ఛాన‌ల్‌కు చెందిన యాంక‌ర్ క‌మియా జాని అడిగిన ప్ర‌శ్న‌ల‌కు రాహుల్ బ‌దులిచ్చారు. 52 ఏళ్ల రాహుల్ ఇంకా పెళ్లి చేసుకోని విష‌యం తెలిసిందే. బ్యాచ‌ల‌ర్ రాహుల్ ఎక్క‌డికి వెళ్లినా .. ఆయ‌న్ను పెళ్లి ప్ర‌శ్న‌లే వేస్తున్నారు. అయితే తాజాగా క‌ర్లీ టెయిల్స్ ఛాన‌ల్‌తో జ‌రిగిన చిట్‌చాట్‌లో రాహుల్ త‌న పెళ్లి గురించి కొన్ని అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. మీరు ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నారా అని యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు .. రాహుల్ స‌మాధానం ఇచ్చారు. ఎవ‌రైనా స‌రైన అమ్మాయి దొరికితే అప్పుడు క‌చ్చితంగా పెళ్లి చేసుకుంటాన‌ని రాహుల్ అన్నారు. దానికి ఏమైనా చెక్‌లిస్టు ఉందా అని ఆ యాంక‌ర్ మ‌రో ప్ర‌శ్న వేసింది.

Also Read : జ‌న‌వ‌రి 27 నుండి 31వ తేదీ వ‌ర‌కు చ‌తుర్వేద హ‌వ‌నం

అదేమీ లేదు, ప్రేమించే వ్య‌క్తి బెట‌ర్ అని, ఆమె ఇంట‌లిజెంట్ అయితే చాలు అన్న‌ట్లు రాహుల్ తెలిపారు. ఇక ఆ ఛాన‌ల్ యాంక‌ర్ మ‌రో ప్ర‌శ్న‌తో రాహుల్‌ను ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. మీ మెసేజ్ అమ్మాయిల‌కు చేరుతుంద‌ని ఆమె పేర్కొన్న‌ది. అయితే మీరు న‌న్ను ఇబ్బందుల్లో ప‌డేస్తున్నార‌ని రాహుల్ న‌వ్వుతూ కామెంట్ చేశారు. తాను పెళ్లాడ‌బోయే వ్య‌క్తి త‌న త‌ల్లి లాంటి గుణాలు క‌లిగి ఉండాల‌ని ఇటీవ‌ల ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రాహుల్ పేర్కొన్న విష‌యం తెలిసిందే.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube