రాహుల్ పాదయాత్ర ను విజయవంతం చేయండి

రాహుల్ పాదయాత్ర ను విజయవంతం చేయండి

1
TMedia (Telugu News) :

రాహుల్ పాదయాత్ర ను విజయవంతం చేయండి.

టీ మీడియా అక్టోబర్ 20 చిన్నంబావి:-

చిన్నంబావి మండల కేంద్రము లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ అధ్యక్షతన కార్యకర్త లా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం లో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి ఈ నెల 23 అడుగులు వేస్తున్న తరుణంలో కొల్లాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీ పీ సిసి సభ్యులు చింతల పల్లి జగదీశ్వర్ రావు ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలి జోడో యాత్రలో పాల్గొనాలని అన్నారు. రాహుల్ గాంధీతో కలిసి ప్రతి కార్యకర్త నడవాలని జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలత రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కిసాన్ సెల్ అధ్యక్షులు పుల్లారెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి ప్రతాపరెడ్డి, యువజన కాంగ్రెస్ కోఆర్డినేటర్ రవి వర్మ,మండల సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ఖాదర్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్ నరేందర్ గౌడ్ , వివిధ గ్రామల అధ్యక్షుడు రమణరెడ్డి, లక్ష్మన్ గౌడ్, యువ నాయకుడు సహదేవుడు, వెంకట్రావు ,శీను,హరికాంత్,డి ఎన్ రాము , వివిధ నాయకులు శివ, మహేష్,బాలు,డబ్బా కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube