కాంగ్రెస్ లో రాహుల్ సభ చిచ్చు
– నాది అంటున్న పొంగులేటి, -మాదిఅంటున్న బట్టి అను చరులు
– అంత ఆ యన మయం
– సమన్వయం కష్టం అంటున్న విశ్లేషకులు
టీ మీడియా, జూన్ 28,రాజకీయ ప్రతినిధి: ఆధి లోనే హంస పాదు లాగా కాంగ్రెస్ లో జూన్ 2 న జరిగే రాహుల్ సభ చిచ్చు ఆరంభం అయింది. ఆ సభ మా ఆహ్వానం, మా చేరిక కోసం అని మాజీ ఎంపి పొంగులేటి గ్రూప్ అంటుండగా, పాదయాత్ర ముగింపు సభ అని సి ఎల్ పి నేత మల్లు బట్టి విక్రమార్క అనుచరులు పేర్కొంటున్నారు.అయన అంచరుడు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వా ళ్ల దుర్గ ప్రసాద్ మీడియా తో మాట్లాడుతూ రాహుల్ గాంధీ వచ్చినప్పుడు చేరే వారు చేరుతారు చేరికలు కోసం,చేరే వారు ఆహ్వానిస్తే రాహుల్ రావడం లేదు అని పేర్కొనడం వెనుక మొదలైన చిచ్చు అనే అభిప్రాయం వస్తుంది.ఇది ఇలా ఉంటే అన్నీ తాను అయ్యి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభా ఏర్పాట్లు చేసుకొంటున్న రు తప్ప తమతో కనీసం బుదవారం వరకు సంప్రదింపులు లేవు అని సీనియర్ కాంగ్రెస్ నేత టి మీడియా ప్రతి నిధి తో అన్నారు. ఆయన పేరు బహిర్గతం కి ఇస్ట పడని ఆ నేత ఇప్పటికే ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్ళాను అన్నారు.భవిషత్ లో జిల్లా కాంగ్రెస్ లో మరిన్ని తగాదాలు ఉంటాయి.కొత్త గ్రూప్ కి అంకురార్పణ తప్పదు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం గా ఉంది.
ALSO READ :విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి
కనిపించని సన్నాహాకం
రాహుల్ సభకు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది.కేవలం 72 గంటలు సమయం ఉంది. 50 గంటల్లో జన సమీకరణ ఏర్పాట్లు ఎలా సాధ్యం అనే అభిప్రయాలు ఉన్నయి.అవసరం అయిన సమన్వయ సమావేశం జరగ లేదు. బి అర్ ఎస్ సభ కంటే ఎక్కువ మంది వస్తారు .లెక్క వేసుకోండి అని పొంగులేటి ప్రకటించారు.ఆ విధంగా జరగాలి అంటే క్షేత్ర స్థాయి లో ఇప్పటికే ఉన్న కాంగ్రెస్ నాయకుల ను రంగం లోకి దింపాలి. గ్రామ స్థాయి మీటింగులు జరగాలి.పోస్టర్లు,ప్రచార సామాగ్రి తో హోరు కనిపించాలి.జనం తరలింపుకు వాహనాలు ఏర్పాట్లు పై సమీక్ష జరగాలి.ఏమి లేదు అని నగర స్థాయి నేత పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ లో ఓక గ్రూప్ కి నాయకత్వం వహిస్తున్న సి ఎల్ పి నేత బట్టి పాదయాత్రలో ఉన్నరు.అయన అనుచరులు వైరా, మధిర లోని కాంగ్రెస్ శ్రేణు లు వరకు పరిమితం అయినట్లు తెలుస్తోంది.పొంగులేటి అనుచరులు ను లీడ్ చెయ్యాల్సిన తుళ్ళూరు బ్రహ్మయ్య,మువ్వ విజయ బాబు నాన్ బైయిల్ వారెంట్ తో అజ్ఞాతం లో ఉన్నారు.మరి కొందరు తమకు చెప్పటం లేదు ఆన్న అసంతృప్తి లో ఉన్నరు.ఖమ్మం నియో జిక వర్గం లో పొంగులేటి కి ప్రత్యేక నెట్వర్క్ లేదు. మరో గ్రూప్ నేత రేణుకా చౌదరి అంటి ముట్ట నట్లు ఉన్నరు.మాజీ మంత్రి సంబాని అదే పరిస్థితి .ఈ నేపథ్యం లో పొంగులేటి సభ విజయవంతం కు చేస్తున్న ఓటరీ ప్రయత్నం సరి పోదు అనే అభిప్రాయం ఉంది.