ఇండ్ల పట్టాలతో రామకృష్ణాపూర్ కు పూర్వ వైభవం

బాల్క సుమన్

1
TMedia (Telugu News) :

ఇండ్ల పట్టాలతో రామకృష్ణాపూర్ కు పూర్వ వైభవం

-బాల్క సుమన్
టీ మీడియా,మే27,రామకృష్ణాపూర్ : సింగరేణి స్థలాల్లో శాశ్వత నిర్మాణాలు నిర్మించుకున్న వారికి ఇండ్ల పట్టాలు అందజేయడం తో రామకృష్ణాపూర్ పట్టణానికి .పూర్వ వైభవం వస్తుందని ప్రభుత్వ విప్ ,చెన్నూరు శాసన సభ్యుడు బాల్క సుమన్ అన్నారు.గురువారం క్యాతన్ పల్లి మున్సి పాలిటి లో నాలుగు చోట్ల ప్రత్యేక కౌంటర్ లను ఏర్పాటు చేసి ఆయనే స్వయంగా లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సుమారు 30 ఏండ్ల క్రితం సింగరేణి ప్రాంతాల్లో కార్మికులు,కార్మికేతరులు ఇల్లునిర్మించుకొని నివాసిస్తుంటే వారికి ఎలాంటి హక్కులు లేవని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక ముఖ్యమంత్రి కే.సి.ఆర్

Also Read : అపరిచిత లింకులను ఓపెన్ చేయరాదు

సింగరేణి ప్రాంతంలో ప్రధాన సమస్య గా ఉన్న పట్టాల పంపిణీ కొరకు జి.ఒ నెంబర్76 ప్రకటించి అమలు చేశారని అన్నారు.పట్టాల అందజేత తో క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లో పండుగ వాతావరణం సంతరించుకున్నదని అన్నారు.మీ ఇండ్లకు ఇక మీరే అధికారిక ఓనర్ లని అన్నారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ,వైస్ చైర్మన్ విద్యాసాగర్,కౌన్సిలర్లు పొగుల మల్లయ్య,పుల్లూరి సుధాకర్,జాది శ్రీనివాస్, నాయకులు అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య లు పాల్గోన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube