155 రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ
టీ మీడియా, నవంబర్ 30, న్యూఢిల్లీ: భారతీయ రైల్వే శాఖ భారీగా రైళ్లను రద్దుచేసింది. వివిధ కారణాలవల్ల దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 155 రైళ్లను రద్దు చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. మరో 55 రైళ్లను దారి మళ్లించామని అధికారులు తెలిపారు. 26 రైళ్ల స్టేషన్లను మార్చామని, 17 రైళ్లను రీషెడ్యూల్ చేశామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైళ్ల వివరాలను వెబ్సైట్లో చూసుకోవాలని కోరారు.
Also Read : టయోటా వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ హఠాన్మరణం
ప్రయాణికుల టిక్కెట్లు ఆటోమేటిగ్గా క్యాన్సిల్ అవుతాయని, వాటికి సంబంధించిన నగదు యూజర్ల అకౌంట్లలోకి రీఫండ్ అవుతుందని వెల్లడించారు. కౌంటర్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు రిజర్వేషన్ కౌంటర్ల దగ్గర రీఫండ్ పొందవచ్చని సూచించారు.