హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

1
TMedia (Telugu News) :

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
టీ మీడియా,మార్చి 20,హైదరాబాద్ :కొన్ని రోజులుగా సూర్యుడి భగభగలతో అల్లాడిపోతున్న రాజధాని వాసులకు ఒక్కసారిగా చిరుజల్లులతో ఉపశమనం లభించింది. హైదరాబాద్​లో వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో పాటు, వర్షం కురుస్తోంది.ఎక్కడెక్కడంటే.!నగరంలోని కాలాపత్తర్​, జూపార్క్​, ఫలక్​నుమా ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. చంపాపేట్​, సైదాబాద్‌, సరూర్​ నగర్​, చైతన్యపురి, మలక్‌పేట్​, అంబర్‌పేట్​, నారాయణగూడ ప్రాంతాల్లో వాన పడుతుండటంతో.. వేసవి తాపం నుంచి నగరవాసులకు ఉపశమనం కలిగినట్లైంది. ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్‌లో వర్షం పడుతుండగా.. ఘట్‌కేసర్‌లో ఈదురు గాలులతో కూడిన వాన కురుస్తోంది. నగర శివారు బహుదూర్​పురా, పాతబస్తీ, దుండిగల్​, సూరారం, దూలపల్లి ప్రాంతాల్లో వర్షం పడుతోంది. వికారాబాద్జిల్లాతాండూరులోఈదురుగాలులతోకూడినచిరుజల్లులకురుస్తున్నాయి.హైదరాబాద్ తూర్పు ప్రాంతాలు ముఖ్యంగా నాగోల్, ఎల్బీనగర్, ఉప్పల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో అర్ధగంట సేపటి దాక కొనసాగనుంది. నగరంలోని మిగిలిన భాగాల్లో వర్షాలు ఉండవు.

Also Read : కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మేల్యే

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube