భారీ వర్షానికి కూలిన ఇంటి పైకప్పు

టి మీడియా ,సెప్టెంబర్. 10 మహదేవపూర్

0
TMedia (Telugu News) :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో కురిసిన భారీ వర్షానికి ఓ ఇంటి పైకప్పు కూలింది. శుక్రవారం అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో కాళేశ్వరం గ్రామానికి చెందిన గగూరి చిన్నక్క అనే మహిళ యొక్క ఇంటి పైకప్పు కూలి ఒకవైపు పడింది మరోవైపు వారు. ఇంట్లోనే నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వారి యొక్క గృహం ధ్వంసం కావడంతో వారు. బిక్కుబిక్కు మంటూ రోడ్డు మీదనే కాలము గడిపే పరిస్థితి దాపురించింది. అధికారులు వెంటనే స్పందించి తగిన సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube