అకాల వర్షం అపార నష్టం

అకాల వర్షం అపార నష్టం

2
TMedia (Telugu News) :

 

అకాల వర్షం అపార నష్టం

టీ మీడియా, మే 12, మహానంది:

రెక్కలు ముక్కలు చేసుకొని ఎన్నో ఆశలతో అరుగాల్లం కష్టించి పండించిన పంటలపై వరుణదేవుడు రైతన్నల ఆశలపై నీళ్లు చల్లాడు. పంట పండించి విక్రయించే సమయానికి రైతుకు వరుణ దేవుడు నిరాశ కలిగించాడు. అఫని తుఫాన్ కారణంగా ఒక్కసారిగా వచ్చిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి కల్లాలలో, ఆరబెట్టిన వేరుశెనగ పంట పూర్తిగా తడిసి ముద్దయింది. దీంతో రైతన్న ఆశలు ఒక్కసారిగా ఆవిరైపోయాయి.

Also Read : అమ్మాయిలా వ్యాపారిని క‌వ్వించాడు

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ అకాల వర్షాల కారణంగా మహానంది మండల పరిధిలోని బసాపురం గ్రామం నందు పదిహేను ఎకరాలలో వేసిన వేరుశనగ పంట పూర్తిగా తడిసిపోయిందని రైతు మధు వాపోతున్నాడు.తడిసిన పంట కొనేవారు లేక దళారుల నుండి గిట్టుబాటు ధర లేక రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వీరిని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాడు. వరుణ దేవుడి రూపంలో వేరుశనగ పంట వర్షార్పణం కావడంతో రైతు గోస వర్ణనాతీతంగా మారింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube