ఈదురుగాలుల బీభత్సం

వర్షపునీటిలో వరిధాన్యం

0
TMedia (Telugu News) :

ఈదురుగాలుల బీభత్సం
-వర్షపునీటిలో వరిధాన్యం
టీ మీడియా,మే 05, జన్నారం:మండలంలో మంగళవారం రోజున రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా చాలా గ్రామాలలోనీ వరి కొనుగోలు కేంద్రం లో గల వరి ధాన్యం అంతా వర్షపు నీటితో తడిచి ముద్ద ల తయారయింది. అనుకోకుండా కురిసిన గాలి బీభత్సానికి చాలా చోట్ల ఇళ్ల పైకప్పులు నేలకొరిగాయి. పలు గ్రామాలలో మామిడి తోట లోని కాయలని నేలమట్టమయ్యాయి.

Also Read : ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

పండించిన వరి ధాన్యం కోసి అమ్మడానికి తీసుకెళ్తే అక్కడ నిల్వ ఉంచగ కురిసిన భారీ వర్షానికి ధాన్య మంతా వర్షం పాలైందని ,కోతకొచ్చిన వరి పొలాలు నేలకొరిగాయి ,అని చేతికొచ్చిన మామిడి కాత నేలమట్టం అయిందని రైతన్నలు విలవిలలాడుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వమే వారికి చేదోడుగా ఉంటూ తగిన న్యాయం చేయాలని తగు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుకుంటున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube