సైబర్ నేరాలపై అవగాహన కల్పిచటం మన బాధ్యత…. ఎస్ ఐ అరుణ

0
TMedia (Telugu News) :

సైబర్ అంబాసిడర్లుగా హాసిని,అఖిల్

టీ మీడియా అశ్వరావుపేట నవంబర్ 23

సైబర్ నేరాలపై విద్యాశాఖ, పోలీస్ శాఖ, మరియు యంగిస్తాన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులైన తొమ్మిదో తరగతి చదువుతున్న అడపా హాసిని, వాడేపల్లి అఖిల్ సైబర్ అంబాసిడర్ లు గా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన అశ్వారావుపేట సబ్ ఇన్స్పెక్టర్ చల్లా అరుణ ఎన్నికైన విద్యార్థుల చేత ప్రమాణం చేయించి,వారికి బ్యాడ్జీలు ప్రధానం చేసి విద్యార్థులను సత్కరించారు అనంతరం ఆమె సైబర్ నేరాల గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు.ఎన్నికైన విద్యార్థులు మాట్లాడుతూ ఆన్లైన్ శిక్షణా తరగతులలో తాము నేర్చుకున్న పలు అంశాలను విద్యార్థులందరికీ వివరించారు. ఈ కార్యక్రమంలోపాఠశాల ప్రధానోపాధ్యాయులు పత్తేపరపు రాంబాబు, డి శ్రీనివాసరావు,హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Raise awareness on cyber crime
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube