రైతు బంధు కోసం కాంగ్రెస్ ధర్నా

కలెక్టర్ కి వినతి పత్రం

1
TMedia (Telugu News) :

 

రైతు బంధు కోసం కాంగ్రెస్ ధర్నా

-కలెక్టర్ కి వినతి పత్రం

టి మీడియా,జూన్ 23,ఖమ్మం:

ఎఐసిసి ఆదేశానుసారం టిపిసిసి రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వాళ్ళ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ధర్మా నిరసనదీక్ష చేసి తదనంతరం జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించనైనది. ఈ సందర్భంగా జిల్లా కాగ్రెస్ అధ్యక్షలు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ మాట్లాడుతు జిల్లాలో తొలకరి బిల్లులు కురిసే వానాకాల వానాకాలం పంట సీజన్ ప్రారంభం అయింది రాష్ట్రప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన రైతుబంధు పథకం క్రింద నిదులు రైతుల ఖాతాలో జమచేయాలని పెట్టుబడి సహాయం కోసం అన్నదాతలు ఎదురు చూపులు చూస్తున్నారని రైతుబంధు నిధులు తక్షణమే రైతుల ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు.

Also Read : ఘనంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 22వ వార్షికోత్సవ వేడుకలు.

సీజన్ సీజన్ కూ వెనక్కు పోతున్న రైతుబంధు నిధులు విడుదల రోజుల తరబడి ఆలస్యమవుతుండటంపై అసహనం వ్యక్తంచేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు జావేద్ గారు మాట్లాడుతు రైతన్నలకు పెట్టుబడి సహాయం క్రింద ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు అందక తమస్థాయికి మించి అధిక వడ్డీలకు తెచ్చుకొని ఆర్ధికంగా నష్టపోతున్నారని అన్నారు. మాజీ శాసన మండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు గారు మాట్లాడుతు టిఆర్ యస్ రాష్ట్రప్రభుత్వం డాక్టర్ స్వామినాదన్ కమీషన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పి అటకెక్కించారని ఎద్దేవా చేశారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు. మాట్లాడుతురైతులకు లక్షరూపాయల రణమాఫీని నిర్వీర్యం చేసి రాష్ట్రప్రభుత్వం రైతన్నల నడ్డి విరిచిందన్నారు.

Also Read : ఎన్ ఆర్ ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షలు యడ్లపల్లి సంతోష్, రాష్ట్ర కిసాన్ సెల్ కన్వీనర్ దాసరి దానియేలు, రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు రాందాస్ నాయక్, రాష్ట్ర ఓబిసి నాయకులు వడ్డెబోయిన నరసింహారావు, రాష్ట్ర మైనార్టీ నాయకులు బియ అబ్బా షేక్ హుస్సేన్, కిలారి అనీల్ కుమార్ పల్లెబోయిన చంద్రం, కొప్పెర ఉపేందర్, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు వద్దే నారాయణరావు, శీలం వెంకటనర్సిరెడ్డి, కళ్ళెం వెంకటరెడ్డి తలారి చంద్రప్రకాష్, అంబటి వెంకటేశ్వరరావు, కొమ్మినేని రమేష్ బాబు, నున్నా కృష్ణయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు యడ్లపల్లి వీరయ్య చౌదరి, వదునూరి సీతారాములు, పొదిల హరినాధ్, బోళ్ళ గంగారావు, కోటేరు నర్సిరెడ్డి, దిరిశాల చిన వెంకటేశ్వరరావు, కృష్ణారావు, సట్టు వీరభద్రం, గౌస్, బాణాల లక్ష్మణ్, అబ్దుల్ అహద్, ముజాహిద్, ప్రదీప్, బోజర్ల సత్యనారాయణ, గడ్డం వెంకటయ్య, బీరెడ్డి రమేష్, బచ్చలికూర నాగరాజు, అంజనీ కుమార్, బోయిన వేణు, కరాటే నవీన్, పూర్ణ, సంపటం నరసింహారావు, భాస్కర్, రాంబాబు, యడవల్లి నాగరాజు , మద్ది వీరారెడ్డి, సట్టు వెంకటేశ్వర్లు, జి కృష్ణయ్య మరియు రైతులు ముఖ్య కార్యకర్తలు అభిమానులు మరియు తదితర నాయకులు పాల్గోన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube