తొమ్మిదో విడత రైతుబంధు నిధులు 28న రైతుల ఖాతాల్లో

తొమ్మిదో విడత రైతుబంధు నిధులు 28న రైతుల ఖాతాల్లో

1
TMedia (Telugu News) :

తొమ్మిదో విడత రైతుబంధు నిధులు 28న రైతుల ఖాతాల్లో

టీ.మీడియా,జూన్27, హైదరాబాద్‌: తెలంగాణలో తొమ్మిదో విడత రైతుబంధు నిధులు 28న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ. 10 వేల చొప్పున ఇప్పటివరకు రూ.50,447.33 రైతుల ఖాతాల్లో జమచేసినట్లు మంత్రి వివరించారు. రైతు బీమా పథకం ద్వారా 83,118 మంది రైతు కుటుంబాలకు రూ.4,150.90 కోట్లు పరిహారం అందజేసినట్లు పేర్కొన్నారు. సీజన్‌కు ముందే ఏ పంటలు వేయాలో రైతులకు సూచించడానికి దేశంలోనే తొలిసారి మార్కెట్ రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్ వింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు.

Also Read : కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంలో భాగంగా 20లక్షల ఎకరాలలో ఆయిల్‌ ఫామ్‌ విస్తీర్ణం పెంపునకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా పత్తి సాగుతోపాటు పప్పు, నూనెగింజలు, కందులు, వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు, మినుములు, పెసర సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. రైతు వేదికలలో సమావేశాలతో పాటు, క్షేత్రస్థాయి పర్యటనలతో వ్యవసాయ అధికారులు రైతులను పంటల మార్పిడి దిశగా చైతన్యం చేయాలని ఆదేశించారు. రైతులతో వ్యవసాయ అధికారుల అనుబంధం మరింత పెరగాలని సూచించారు. వ్యవసాయ అధికారులతో పాటు అన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు సంబంధించిన అన్ని సభలు, సమావేశాలకు రైతువేదికలను ఉపయోగించుకోవాలన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube