తహశీల్దార్ కేంద్రంగా రైతు మహాధర్నా ..రేగా కాంతారావు .

0
TMedia (Telugu News) :

టీ, మీడియా, నవంబర్,12 మణుగూరు .

తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సీఎం కేసీఆర్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రైతు మహాధర్నా కార్యక్రమం లో భాగంగా మణుగూరు మండల తహసిల్దార్ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది… తహసిల్దార్ కార్యాలయము నందు యాసంగిలో వడ్లు కొనబోమన్న కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా చేపట్టిన రైతు ధర్నాలో పాల్గొన్న… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మాట్లాడుతూ…

పంటల కోసం ఆరుగాలం శ్రమిస్తున్న రైతులకు లాభం చేకూరాలనే ఉద్దేశంతో రైతుబంధు పథకం ద్వారా పంట పెట్టుబడి సహాయాన్ని సీఎం కేసీఆర్ అందిస్తున్నారని..
సీఎం కేసీఆర్ కృషితో సాగు నీరు పుష్కలంగా ఉండడంతో రాష్ట్రంలోని రైతులు ఎక్కువగా వరి పంటలను చేస్తున్నారని ,ఈ నేపథ్యంలో వరిపంటను తాము కొనలేమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు…

యాసంగి సీజన్ నుంచి ధాన్యం కొనుగోలు చేయబోమని ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా, మరోపక్క రాష్ట్ర బిజెపి నాయకులు అవగాహన లేకుండా ఇష్టానుసారంగా విమర్శలు చేస్తూ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై మిమర్మలు చేయడం తగదన్నారు .

రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పాటుపడుతూ స్పష్టమైన వైఖరితో ముందుకు సాగుతుంటే… కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో అనుసరిస్తున్న వైఖరిని అర్థం చేసుకోకుండా రాష్ట్ర బిజెపి నాయకులు రైతులను మోసం చేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై బురద జల్లుతూ అబద్ధాలతో దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుందని అన్నారు… వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పండగలా చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం విధానాలు రైతుల నడ్డివిరిచే లా ఉన్నాయన్నారు…
అనంతరం తహసీల్దార్ చంద్రశేఖర్ కి రైతుల సమస్యలపై వినతిపత్రం అందజేయడం జరిగింది…ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్ శ్రీ తుళ్లూరి బ్రహ్మయ్య , జెడ్పీటీసీ పోశం నర సింహా రావు,
ఎంపీపీ, కారం విజయ కుమారి . అశ్వాపురం ఎంపీటీసీ ముత్తినేని సుజాత , గుడిపూడి కోటేశ్వర రావు, అడప్పా అప్పారావు, మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…

A large scale organized by Telangana State Government Whip and Pinapaka legislator Shri Rega kanatarao.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube