తెలంగాణ రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డి కౌంట్ లెస్..

- మండిప‌డ్డ చెరుకు సుధాక‌ర్

0
TMedia (Telugu News) :

తెలంగాణ రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డి కౌంట్ లెస్..

– మండిప‌డ్డ చెరుకు సుధాక‌ర్

టీ మీడియా, నవంబర్ 18, సూర్యాపేట : బీఆర్ఎస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అన్న కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కౌంట్ లెస్ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల కాలంలో కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిన‌ అనుచిత వ్యాఖ్యలపై సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు దగ్గరికి వస్తా ఉంటే రాజకీయ నాయకులు విమర్శలు – ప్రతి విమర్శలు సాధారణం కానీ నకిరేకల్, సూర్యాపేట తుంగతుర్తిలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన భాషా, ప్రవర్తించిన తీరు అత్యంత అసహ్యకరంగా ఉందన్నారు. ఉద్యమకారులను అవమానించే రీతిలో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీని అధ:పాతాలానికి తొక్కాలని చూసిన రాజగోపాల్ రెడ్డి పక్కా కమర్షియల్ లీడర్ అని ఎద్దేవా చేశారు. నకిరేకల్, సూర్యాపేట‌, తుంగతుర్తిలలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎదుగుదల లేని మానసిక స్థితికి నిదర్శనం అన్నారు.మంత్రి జగదీష్ రెడ్డి, ద‌ళిత ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య‌పై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకర‌మ‌న్నారు.

Also Read : ఒక్కటి కాదు 11 ఛాన్సులిచ్చాం.. అయినా ఏం చేశారు..

నల్లగొండ జిల్లా ఉద్యమస్ఫూర్తిని అవమానించేలా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని చెరుకు సుధాక‌ర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఎందుకు దించాలో చెప్పే ద‌మ్ము కాంగ్రెస్ పార్టీలో ఎవ‌రికైనా ఉందా..? అంటూ చెరుకు సుధాక‌ర్ స‌వాల్ విసిరారు. జీవితమంతా బ్రోకర్ పనులు చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ జోకర్ పనులను తక్షణమే బంద్ చేయాలి అని కోరారు. ప్రత్యామ్నాయం చూపించాలనుకునే కాంగ్రెస్ నాయకులు ముందు వారి ఎజెండా ఎందో చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఓబీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటన్న చెరుకు సుధాకర్, ఉదయపూర్ డిక్లరేషన్‌ను ఏ తుంగలో తొక్కారో కాంగ్రెస్ నేతలు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. వీరేశంను వీరుడు అన్న రాజగోపాల్ రెడ్డి అదే వీరేశం హంతకుడు అన్నది నిజం కాదా? అంటూ చెరుకు సుధాక‌ర్ ప్రశ్నించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube