తెలంగాణలో రూ.24వేలకోట్లతో రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ పెట్టుబడి

తెలంగాణలో రూ.24వేలకోట్లతో రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ పెట్టుబడి

1
TMedia (Telugu News) :

తెలంగాణలో రూ.24వేలకోట్లతో రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ పెట్టుబడి

-ఐటీ, పరిశ్రమల మంత్రి ప్రకటించిన కేటీఆర్‌
టీ మీడియా, జూన్ 13, హైదరాబాద్‌ : తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు వేలకోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ఆదివారం ప్రకటించారు. స్మార్ట్‌టీవీలు, మొబైల్‌ఫోన్ల డిస్‌ప్లేలను తయారు చేసే సంస్థ అమోలెడ్ భారత్‌లో అతి పెద్ద పరిశ్రమను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని పేర్కొన్నారు.

 

Also Read : మల్లన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ (ఎలెస్ట్‌) అమోలెడ్ డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్‌ తయారీ యూనిట్‌ను తెలంగాణలో స్థాపించనుందని కేటీఆర్‌ తెలిపారు.ఇందుకు రూ.24వేలకోట్ల పెట్టుబడి పెట్టనుందని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ అత్యాధునిక అమోలెడ్ స్క్రీన్‌లను తయారు చేస్తోంది. ఇప్పటి వరకు జపాన్‌, కొరియా, తైవాన్‌ దేశాలకు సాధ్యమైన అరుదైన ఫీట్‌ ఇకపై ఇండియాలోనూ చోటు చేసుకోబోతుందని పేర్కొన్నారు. ఈ పరిశ్రమ రాకతో టీవీలు, ట్యాబ్స్‌, స్మార్ట్‌ఫోన్ల తయారీకీ అవసరమైన ఎకో సిస్టమ్‌ తెలంగాణలోనే తయారవుతుందని, తెలంగాణకు ఈ రోజు చారిత్రాకమైన రోజని కేటీఆర్‌ అభివర్ణించారు. ఈ మేరకు రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ చైర్మన్‌తో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అవగాహన ఒప్పందంపై బెంగళూరులో సంతకాలు చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube