పాలకుడు ఇలా ఉంటే ప్రత్యర్థులకు వణుకే

చాణక్యుడు చెప్పిన రాజతంత్రం

1
TMedia (Telugu News) :

పాలకుడు ఇలా ఉంటే ప్రత్యర్థులకు వణుకే,

-చాణక్యుడు చెప్పిన రాజతంత్రం

లహరి, డిసెంబర్20, ప్రతినిధి : ఆచార్య చాణక్యుడు..గొప్ప వ్యూహకర్త, పండితుడు, ఉపాధ్యాయుడు, సలహాదారుడు, ఆర్థికవేత్త…మౌర్య వంశం విజయం వెనుక చాణక్యుడి దౌత్యం ఉంది. గొప్ప వ్యహకర్త, ఆర్థికవేత్త అయిన చాణక్యుడు తన విధానాల బలంతో నంద వంశాన్ని నాశనం చేసి…చంద్రగుప్త మౌర్యను మగధ చక్రవర్తిగా చేశాడు. తన అసమాన ప్రతిభతో మౌర్య సామ్రాజ్య ఖ్యాతిని దేశం నలుచెరగులా వ్యాపింపజేసిన ఘనత ఆచార్య చాణక్యుడిది. దౌత్యవేత్తగా, రాజనీతికోవిదుడిగా, ఆర్థికవేత్తగానూ మన్ననలు అందుకున్న కౌటిల్యుడు పరిపాలన గురించి చెప్పిన కొన్ని విషయాలు అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ ఆచరణీయమే.. ముఖ్యంగా రాజు/పాలకుడి తీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో కొన్ని విషయాలు చెప్పాడు.

మంచి రాజు లేదా పాలకుడు ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు తాను తీసుకున్న నిర్ణయానికి విరుద్ధమైన భావాలున్నవారితో కూడా సంప్రదించాలి.అప్పుడే ఆ విషయం గురించి సమగ్ర స్వరూపం అర్థమవుతుంది.రాజు ఎప్పుడూ నియంతగా ఉండకూడదు..అందర్నీ కూడగట్టి నిర్ణయం తీసుకోవాలన్నది చాణక్యుడు ఉద్దేశంమంత్రుల సలహాలను వింటున్నప్పుడు రాజు అవి ఎలాంటి సలహాలు అయినా శాంతంగా వినాలి కానీ వారితో తగవుపెట్టుకోరాదుబలవంతుడైన రాజు బలహీనుడైన రాజుతో యుద్ధం చేయాలి కానీ తనతో సమానమైన వారితో బాహాబాహీకి దిగరాదు.తనతో వైరం ఉన్న రాజులు ఇద్దరు పొరుగున ఉన్నప్పుడు వారితో వైరం పెంచుకోవడం కన్నా..వారిద్దరి మధ్యా తగవు పెట్టగలగాలి..అప్పుడే తన రాజ్యం సురక్షితంగా ఉంటుందివ్యసనాలకు బానిసైన రాజు చేసే ప్రయత్నాలు ఎప్పుడూ సత్ఫలితాలు ఇవ్వవు. అపారమైన సైన్యం ఉన్నప్పటికీ వ్యసనాలకు బానిసైన రాజు నాశనం కాక తప్పదుచాలా కఠినమైన శిక్షలు విధించే రాజును ప్రజలు ఎప్పుడూ ద్వేషిస్తూనే ఉంటారు
తనని తాను జయించుకున్నవాడు మాత్రమే రాజుగా తన బాధ్యతలు నిర్వహించగలడు( తనను తాను జయించుకోవడ అంటే తనలో ఉన్న కామ, క్రోధ, మద, మాత్సర్యాలను జయించుకోవడం అని అర్థం.
రాజ తంత్రంలో నాలుగు విషయాలు

Also Read : లివింగ్ రూంను అలంకరిద్దాం

మొదటిది:ఇంతవరకూ లభించనిది లభించేలా చేసుకోవాలి. దీనిని ‘అలభిలాభ’ అంటారురెండవది:సంపాదించిన దాన్ని రక్షించుకోవడం. దీనిని లాభ రక్షణం అంటారు.మూడవది:సంపాదించినదాన్ని రక్షించడం మాత్రమే కాదు దాన్ని విస్తృత పరచాలి.ఈ పద్ధతిని లబ్ధి వివర్థనం అంటారునాల్గవది:విస్తృత పరచిన సంపాదనను అవసరం అయినవారికి పంచాలి..అంటే దానం చేయాలి. ఈ పద్ధతిని భృత్యప్రెషానమ్ అంటారు. రాజు ఎక్కువ కాలం అధికారంలో ఉండడం అతని కండబలం మీద ఆధారపడి ఉంటుంది. రాజుకు చాలా మంది మంత్రులు ఉన్నప్పటికీ రాజు బలహీనంగా ఉంటే ఎక్కువ కాలం సింహాసనంపై ఉండలేడు. నాయకులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే మంచి పాలన సాధ్యం అవుతుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube