ప్రజా పోరాటాల ద్వారా మరింత బలోపేతం చేయండి.
రాజుపేట శాఖ మహాసభలో రావులపల్లి
టీ మీడియా,డిసెంబర్,11, భద్రాచలం
భద్రాచలం పట్టణంలో సిపిఐ శాఖ మహాసభల్లో భాగంగా శనివారం పట్టణంలోని రాజుపేట లో సిపిఐ శాఖ మహాసభ సింగు కోటేశ్వరరావు మార్కాపురం సీతారాములు అధ్యక్షత న జరిగింది. మహాసభ ప్రారంభానికి ముందు సిపిఐ పతాకాన్ని సీనియర్ నాయకురాలు ఖాదర్ భి ఆవిష్కరించారు
ఈ మహాసభలో ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని అన్నారు.
ముఖ్యంగా భద్రాచలం పట్టణం పై ముఖ్యమంత్రి సవతితల్లి ప్రేమ చూపెడుతున్నారని అన్నారు.కనీసం పంచాయతీ నా,మున్సిపాలిటీ నా కూడా తేల్చకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం కరెక్ట్ అన్నారు.
ప్రజా పోరాటాల ద్వారానే పార్టీని బలోపేతం చేయాలని ఆయన అన్నారు. కమ్యూనిస్టు పార్టీకి శాఖలే పునాదులు అని ప్రతి కాలనిలో ఎర్రజెండా ఉంటేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.రాష్ట్రంలో కేసీఆర్ దేశంలో మోదీ పాలనలో సామాన్య ప్రజలు జీవనం సాగటం కష్టంగా మారింది అని అన్నారు.నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతున్న కళ్ళు ఉండి చూడలేని స్థితి లో ప్రభుత్వం ఉందని అన్నారు.
ప్రజా పోరాటాల ద్వారా పాలకుల మెడలు వంచాలని అన్నారు.
ఈ మహాసభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తమ్మళ్ల వెంకటేశ్వరరావు,సిపిఐ పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్ కుమార్, సిపిఐ నాయకులు బల్లా సాయి కుమార్,బత్తుల నర్సింహులు,మధు,జీవన్, దుర్గా,ప్రభుకుమార్,కిరణ్, ప్రకాష్,మనోహర్,వెంకటేష్ మరియు శాఖ సభ్యులు పాల్గొన్నారు.