మహా జనుల రాజ్యాధికారం కోసం శ్రమిద్ద్దాం.

మహా జనుల రాజ్యాధికారం కోసం శ్రమిద్ద్దాం.

1
TMedia (Telugu News) :

మహా జనుల రాజ్యాధికారం కోసం శ్రమిద్ద్దాం.

టీ మీడియా జూన్ 18,భద్రాచలం.

స్థానిక ఆదర్శ నగర్ కాలనీలో మహాజన సోషలిస్టు పార్టీ భద్రాచలం పట్టణ కన్వీనర్ బొడ్డు సత్యనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మహాజన సోషలిస్టు పార్టీ (ఎం ఎస్ పి) భద్రాచలం నియోజకవర్గ కోఆర్డినేటర్ అలవాల రాజా పెరియార్, నియోజకవర్గ కన్వీనర్ సోమక నరేష్ కుమార్ లు పాల్గొని మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారం చేతులో ఉండి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేస్తుందో తన ఏళ్ల పాలన లో కనిపిస్తుందని, త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో దొరల గడీల పాలన నడుస్తోందని అన్నారు.

Also Read : పట్టణప్రగతి పనులు పూర్తి చేయాలి

కెసిఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అన్న హామీ మొదలుకొని ఎస్సీ ఎస్టీలకు మూడెకరాల భూమి పంపిణీ, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు, మహిళలకు 32 శాతం రిజర్వేషన్లు, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, జర్నలిస్టులకు ఇండ్లు, ఇలా అనేక వాగ్దానాలు నీటిమీద రాతలు అయ్యాయని అన్నారు. ఎటువంటి అధికారం లేకుండానే మహా జననేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎంఎస్సీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రతిపేద ఇంటికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత మందకృష్ణ మాదిగ గారికి దక్కుతుందని, ఎస్సీ వర్గీకరణ ద్వారా 25 వేల ఉద్యోగాలు సాధించటం, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లో రిజర్వేషన్ సాధించడం, వృద్ధులు వితంతువులు వికలాంగులకు పింఛన్ సాధించడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు సాధించడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సవరణలు లేకుండా సాధించడం, రేషన్ కోట ద్వారా ఆరు కేజీలు బియ్యం పెంపు సాధించడం, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం 10లక్షల ఎక్స్గ్రేషియా సాధించడం, ప్రతి పేదింటి బిడ్డగా మందకృష్ణ మాదిగ సేవలు చేశారని గుర్తు చేశారు.

Also Read : హైదరాబాద్ నుండి ఖమ్మం బయల్దేరి వస్తున్న తెరాస ఎంపీల బృందం

మహాజన సోషలిస్టు పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వికలాంగుల పార్టీ అని అన్నారు. మహాజన సోషలిస్టు పార్టీ నిర్మాణం కోసం ప్రతి కార్యకర్త శ్రమించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన పోవాలంటే ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల అంతా ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొడ్డు సత్యనారాయణ, ఎంఎంఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఇల్లందుల హేమలత, మహిళ సమైక్య నాయకురాలు తరణి కళ్యాణి, చీరాల పార్వతి, ఆలేటి కుమారి, ఈశ్వరమ్మ, తాటి చెట్టు హనుమంతు, దుర్గ, వెంకటేశ్వర్లు, అనుపోజు సత్యవతి, రవణమ్మ, వరలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube