ఘనంగా రాకేష్ దత్త జన్మదినం వేడుకలు

1
TMedia (Telugu News) :

-మున్సిపాల్టీ కార్మికులకు చీరెలు, చికెన్ పంపిణీ

-పేదలకు 2 క్వింటాల బియ్యం అందజేత

-అన్నం ఫౌండేషన్ లో 24 కేజీల కేక్ కటింగ్, వితరణ

ఖమ్మం నగరం-

ఖమ్మం నగరానికి చెందిన ఓయూ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త జన్మదినం వేడకులు ఖమ్మం నగరంలో ఘనంగా జరిగాయి. నగరంలోని అన్నం ఫౌండేషన్ లో 24 కేజీల కేక్ కట్ చేసి, అన్నం ఫౌండేషన్ లోని వికలాంగులు, అనాధలకు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని 2వ డివిజన్ లో పనిచేస్తున్న మున్సిపాల్టీ కార్మికులకు చీరెలు మరియు కేజీ చికెన్ అందజేశారు. పేదలు, వికలాంగులకు 2 క్వింటాల బియ్యం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు సాయం చేయటానికి యువత మరియు ఆర్థికంగా స్థిరంగా ఉన్న వాళ్లు ముందుకు రావాలన్నారు. మనకున్న దాంట్లో కొద్దిగ సాయం చేయటం ద్వార పేదల కళ్లల్లో ఆనందం చూడవచ్చు అని ఆ ఆనందాన్ని ఎంత డబ్బులు ఖర్చు చేసినా పొందలేమన్నారు. పుట్టిన రోజు, ఇంతర శుభకార్యాల సందర్భంగా ఎంతో కొంత పేదలకు సాయం చేసే అలవాటును అలవర్చుకోవాలని సూచించారు. దానిలో భాగంగానే తన పుట్టిన రోజున పేదలకు, మున్సిపాల్టీ కార్మికులకు తనకు చేతనైన సాయం చేసినట్టు తెలిపారు. అయితే పుట్టిన రోజు నాడు అందరిలాగా జల్సాలకు ఖర్చు చేయకుండా పేదలకు సాయం చేసిన రకేష్ దత్తాను ఖమ్మం నగర ప్రజలు మరియు ప్రముఖులు, ఆయన అనుచరులు అభినందించారు. ఇలాగే పేద ప్రజలకు సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. గతంలోనూ కరోనా సమయంలో పేద ప్రజలకు ఆర్థికంగా సాయం చేయటంతో పాటుగా బియ్యం నిత్యావసరాలను సైతం రకేష్ దత్తా అందించి దయగుణాన్ని చాటుకుని మన్ననలు పొందారు. ఈ కార్యక్రమంలో బాషబోయిన ఉపేందర్ ,గొనె శ్రీ శ్రీ ,వేముల శ్రవణ్ ,ఉదయ్ గౌడ్ ,అన్వర్ భాయ్ , చింతల రోహిత్ ,రేవంత్ ,రమేష్ సుధాకర్ , సాంబ ముదిరాజ్ యువత పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube