రక్షాబంధన్ స్పెషల్
-ఈ స్వీటు ధర కిలో రూ. 25,000
టీ మీడియా,ఆగస్టు5, లక్నో : ఉత్తరాదిలో పర్వదినాల్లో ప్రజలు ఇష్టంగా తినే ఘెవర్ స్వీట్ ఆగ్రాలోని ఓ స్వీట్ షాప్‌లో కిలో ధర ఏకంగా రూ 25,000 పలుకుతోంది. రక్షా బంధన్ దగ్గరపడుతుండటంతో ఆగ్రాలోని బ్రిజ్ రసాయనం మిస్తాన్ భండార్ అనే స్వీటు షాప్ ప్రత్యేకంగా 24 క్యారెట్ బంగారు పూతతో తయారు చేసిన ఈ స్వీట్‌కు ప్రజల నుంచి ఆర్డర్లు భారీగా వస్తున్నాయి.
Also Read : కౌశిక్ రెడ్డి సవాల్‌కు తోక ముడిచిన ఈటల రాజేందర్
ఆర్డర్లపైనే తాము గోల్డెన్ ఘెవర్ స్వీట్‌ను ఆఫర్ చేస్తన్నామని స్వీట్ షాపు యజమాని తెలిపారు. సాధారణంగా ఘెవర్ స్వీట్ కిలో రూ 600 నుంచి రూ 800 మధ్య లభిస్తుంది. ఇక గోల్డెన్ ఘెవర్కు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రెడ్ బాక్స్‌లో ప్యాక్ చేసిన గోల్డెన్ ఘెవర్ స్వీట్‌ను కస్టమర్లు ఆసక్తిగా చూస్తుండటం వీడియోలో కనిపించింది. డిస్క్ షేప్‌లో ఉండే ఘెవర్ స్వీట్ ప్రధానంగా రాజస్ధాన్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తీజ్, రక్షా బంధన్ వంటి పర్వదినాల్లో ప్రజలు ఇష్టంగా తింటుంటారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube