రామగుండం పరిశ్రమలకు అనువైన ప్రాంతం

యువతకి ఉపాధి అవకాశాలు కల్పించండి

0
TMedia (Telugu News) :

రామగుండం పరిశ్రమలకు అనువైన ప్రాంతం

– యువతకి ఉపాధి అవకాశాలు కల్పించండి

– కేటీఆర్ ను కోరిన వ్యాల్ల హరీష్ రెడ్డి

టీ మీడియా,జనవరి 16, పెద్దపల్లి : స్విట్జర్‌లాండ్ లోని దావోస్‌లో జనవరి 16 నుండి 20వ తారీఖు వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జూరిచ్ చేరుకున్న తెలంగాణ ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను జూరిచ్ విమానాశ్రయంలో ఎన్ఆర్ఐలు లు భారీ ఎత్తున స్వాగతం పలికారు.ఈ సందర్బంగా పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల ఎంపీపీ వ్యాల్ల అనసూయ రామిరెడ్డి కుమారుడు,బిఆర్ఎస్ ఎన్అర్ఐ నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి స్వాగతం పలికారు.భవిష్యత్ లో పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధం గా కృషి చేయాలనీ,కొత్త పరిశ్రమలకి ఎంతో అనువైన వనరులున్న ప్రాంతం అని, ఇక్కడి.

Also Read : మృతుని కుటుంబాన్ని తహసిల్దార్ పరామర్శ

యువత కి ఉపాధి కల్పించే విధంగా తన వంతు గా కూడా కృషి చేయడానికి సిద్ధం గా ఉన్నానని అయన తెలిపారు,ప్రభుత్వ పరంగా పూర్తి సహకారాన్ని అందించాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ని కోరారు.ఈ కార్యక్రమం లో భారీ ఎత్తున ఎన్నారైలు,వారి కుటుంబాలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube