రామకృష్ణాపూర్ పట్టణ అస్తిత్వం,పునరుజ్జీవం లక్ష్యం

ఎమ్మెల్యే బాల్క సుమన్

1
TMedia (Telugu News) :

రామకృష్ణాపూర్ పట్టణ అస్తిత్వం,పునరుజ్జీవం లక్ష్యం

– ఎమ్మెల్యే బాల్క సుమన్

– జీవో 76 మూడవ విడత గా సింగరేణి ఇళ్ల పట్టాల పంపిణీ

టీ మీడియా, జూన్25, రామకృష్ణాపూర్; క్యాతనపల్లి పరిధిలో రామకృష్ణాపూర్ పట్టణంలోని స్థానిక గణేష్ ఆలయం లో మూడో విడతగా సింగరేణి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ,కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గార్ల చేతులమీదుగా 408 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ శుక్రవారం చేశారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ ప్రజల్లో ఉన్నది ఒకే కులం కార్మికులం. రామకృష్ణాపూర్ పట్టణ అస్తిత్వం & పునర్జీవం నా లక్ష్యం. ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నా అదృష్టం గా భావిస్తున్నాను, గత పాలకుల నిర్లక్ష్యం క్యాతనపల్లి మున్సిపాలిటీకి శాపంగా మారింది 60 ఏళ్ల నుంచి ఈ ప్రాంత ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ఆలోచన రాకపోవడం దురదృష్టకరం. 2014 సింగరేణి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాము, జీవో 76 తీసుకొచ్చి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి అంకురార్పణ చేశాం.

 

Also Read : నకిలీ విత్తనాలు, ఎరువులతో మోసం చేస్తే ఉపేక్షించేది లేద

 

ఈ ప్రక్రియ పూర్తయితే సుమారు నాలుగు వేల మందికి పైగా మహిళలు లక్షాధికారులు కాబోతున్నారు. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందేలా చూస్తాం. 4000 వేల క్వార్టర్ల లను రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అప్పజెప్పడం నామమాత్రపు రుసుముతో పేద ప్రజలకు అందించేలా చర్యలు ప్రారంభించాము. రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు 27.50 కోట్ల రూపాయలతో త్వరలోనే పూర్తి అవుతున్న నేపథ్యంలో రవాణా వ్యవస్థ కూడా మరింత మెరుగు అవ్వనుంది. తెలంగాణకు కెసిఆరే శ్రీరామరక్ష. ప్రజలందరి మద్దతు ఎప్పుడు కేసీఆర్ గారికె ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. బాల్క సుమన్ అద్భుతంగా చెన్నూరు నియోజకవర్గాన్ని తీర్చి దిద్దుతున్నారు. కెసిఆర్ ప్రభుత్వాన్ని తిట్టే నైతిక హక్కు విపక్షాలకు లేదు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్ ,జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి, గ్రంధాలయ చైర్మన్ రేణిగుంట్ల ప్రవీణ్ కుమార్ , మున్సిపల్ పాలకవర్గం, అధికారులు, నాయకులు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube