విద్యార్థులను అభినందించిన డాక్టర్ కోట రాంబాబు

1
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్27, మధిర:

పట్టణంలోని సుశీల జూనియర్ కాలేజీ విద్యార్థులు ఇటీవల విడుదల చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో రాష్ట్రస్థాయి మార్కులు సాధించిన విద్యార్థులను కే వి ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కోట రాంబాబు అభినందించి మెమొంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాంబాబు మాట్లాడుతూ… గత సంవత్సరం క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆన్లైన్, ప్రత్యక్ష తరగతుల ద్వారా జరిగిన బోధనను వినియోగించుకొని అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రశంసించారు.అనంతరం కళాశాల యాజమాన్యం డాక్టర్ రాంబాబును ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల హరినాథ్, ప్రిన్సిపాల్ నరసింహా రావు, నవీన్,గోవింద్ పాల్గొన్నారు.

Dr. Kota Rambabu Congratulates students who achieved state level marks in the recently released intermediate first year results .
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube