రామ్‌కో సిమెంట్ కంపెనీని ప్రారంభించిన సీఎం జగన్

1000 మందిస్థానికులకు ఉద్యోగాలు

1
TMedia (Telugu News) :

రామ్‌కో సిమెంట్ కంపెనీని ప్రారంభించిన సీఎం జగన్
-1000 మందిస్థానికులకు ఉద్యోగాలు

టీ మీడియా, సెప్టెంబరు 28, నంద్యాల :ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నంద్యాల జిల్లాలో పర్యటించారు. కొలిమిగుండ్ల మండలం కల్వటాలలో రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించారు. పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం చేయూత ఇస్తోందని.. ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎంతో మంచి జరుగుతుందన్నారు సీఎం. స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరిగాయన్నారు. రామ్‌కో పరిశ్రమతో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయని.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు ఏపీనే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.

Also Read : మంచిరెడ్డి దావూద్ ఇబ్రహీంను దాటిపోయాడు.

రాష్ట్రంలో పరిశ్రమలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. రాయలసీమ ప్రాంతంలో దాదాపు 20వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలపై దృష్టి పెట్టామన్నారు.
కర్నూలు జిల్లాలో గ్రీన్‌ కో ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశామన్నారు సీఎం. రైతులకు మంచి జరగడంతో పాటు ఉద్యోగావకాశాలు రావాలని.. తమది ఇండస్ట్రీస్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. ఈ సారి పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చారన్నారు. సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు రైతులు ముందుకొస్తే ఎకరాకు ఏడాదికి రూ.30వేలకు లీజు ఇస్తామని.. మూడేళ్లకోసారి 5 శాతం లీజు పెంచుతామన్నారు. కనీసం 2 వేల ఎకరాలు ఒక క్లస్టర్‌గా ఉండాలని.. గ్రోత్‌ రేటులో దేశంలో ఏపీ నంబర్‌వన్‌గా ఉంది అన్నారు.

రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్ వాచీలు, హెడ్ ఫోన్స్, కంప్యూటర్ యాక్సిసరీలు ఇంకా మరెన్నో వాటిపై బ్లాక్ బస్టర్ డీల్స్మొత్తం రూ.1,790 కోట్లతో రామ్‌కో కంపెనీ సిమెంట్‌ పరిశ్రమను నెలకొల్పింది. ఏటా 2 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి అవుతుంది. కల్వటాలలో అత్యాధునిక టెక్నాలజీతో రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమను నిర్మించారు.

Also Read : అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేసిన మంత్రి పువ్వాడ

ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నాయినపల్లె, కల్వటాల, కొలిమిగుండ్ల, చింతలాయిపల్లె, కనకాద్రిపల్లె, ఇటిక్యాల రైతుల నుంచి దశల వారీగా 5 వేల ఎకరాల భూమిని సేకరించారు. 2018 డిసెంబర్‌ 14లో పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు వేగవంతం అయ్యాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube