ఏల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులుగా రమేష్ నాయక్
టీ మీడియా, నవంబర్ 25, మహబూబాబాద్ : శుక్రవారం నంగార భేరి లంబాడి హక్కుల పోరాట సమితి మహబూబాబాద్ మండల అధ్యక్షులుగా అమనగల్ బలరాం తండా కు చెందిన రమేష్ నాయక్ గారిని ఏకగ్రీవంగా నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ నియామక పత్రాన్ని అందజేశారు.
Also Read : రైల్వే సమస్యలపై వినతి పత్రం అందజేత
ఈ సందర్భంగా రమేష్ నాయక్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నన్ను మహబూబాబాద్ మండల అధ్యక్షులుగా ఎన్నికకు సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావత్ వాసు నాయక్ గారికి జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ గారికి జిల్లా కార్యదర్శి బోడ శ్రీను నాయక్ గారికి జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో లంబాడి జాతి కోసం జరిగే పోరాటంలో నా వంతు పాత్ర పోషిస్తానని తెలియజేశారు.