రైల్వే స్టేష‌న్‌లో మ‌హిళ‌పై సామూహిక అత్యాచారం

భర్తను కొట్టి అఘాయిత్యం

1
TMedia (Telugu News) :

రైల్వే స్టేష‌న్‌లో మ‌హిళ‌పై సామూహిక అత్యాచారం -బాధితురాలు గర్భిణీ
-భర్తను కొట్టి అఘాయిత్యం
-మంత్రి నాగార్జున మహిళకు పరామర్శ
-పోలీసుల అదుపులో ముగ్గురు
-పోలీసుల అదుపులో ముగ్గురు

టీ మీడియా, మే 1,బాప‌ట్ల: జిల్లా రేప‌ల్లె రైల్వే స్టేష‌న్‌లో మ‌హిళ‌పై గ్యాంగ్ రేప్ జ‌రిగింది. భ‌ర్త‌ను బెదిరించి మ‌రీ, ప్లాట్‌ఫాంపైనే అత‌ని భార్య‌పై గ్యాంగ్ రేప్ చేశారు. ఎర్ర‌గొండ పాలెం నుంచి తాపీ ప‌నుల కోసం దంప‌తులు నాగాయ‌లంక‌కు వెళ్తున్నారు. అర్ధ‌రాత్రి రేప‌ల్లె రైల్వే స్టేష‌న్‌లో దిగారు. అక్క‌డి నుంచి బ‌స్సులో వెళ్లాల‌ని దంప‌తులు అనుకున్నారు.అయితే రాత్రి స‌మ‌యం కావ‌డంతో దంప‌తులు రేప‌ల్లె రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే నిద్రించారు. దంప‌తులు నిద్రించిన త‌ర్వాత అక్క‌డికి ముగ్గురు వ్య‌క్తులు వ‌చ్చారు. భ‌ర్త‌ను బెదిరించారు. ఆపై దాడి చేసి, భార్య‌పై సామూహిక అత్యాచారం చేశారు.స్పందించిన సీఎం జ‌గ‌న్‌.. జిల్లా ఎస్పీకి ఫోన్‌రప‌ల్లెలో జ‌రిగిన గ్యాంగ్ రేప్‌పై ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స్పందించారు. బాప‌ట్ల ఎస్పీ వ‌కుల్ జిందాల్‌తో ఫోన్లో మాట్లాడారు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ ఎస్పీని ఆదేశించారు. బాధితురాలిని పరామర్శించిన మంత్రి రేపల్లే ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచార బాధితురాలిని మంత్రి మేరుగ నాగార్జున పరామర్శించారు. ఇటువంటి ఘటన బాధాకరమన్నారు. దుండగులతో భర్త పెనుగులాడి పోలీసుల వద్దకు పరుగెత్తాడని, ఈ సమయంలో ఆమెపై అత్యాచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Also Read : బీజేపీ నేత కుమారుడి టోకరా

 

నిందితులను గుర్తించి పట్టుకోమని చెప్పామన్నారు. అప్రమత్తమైన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించి, నిందితులను పోలీసులు గుర్తించారన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని, గతంలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు పట్టించుకునే వారు ఉండేవారు కాదన్నారు. గుడ్డ కాల్చి ప్రభుత్వంపై వేసే ప్రయత్నం చేశారని చెప్పారు. ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఇస్తుందన్నారు. టీడీపీ నేతలు రాబందుల్లా వాలిపోతున్నారని మండిపడ్డారు. చట్టం ప్రకారం ఏంచేయాలో అది చేస్తామన్నారు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు: మంత్రి రజిని
రేప‌ల్లె రైల్వే స్టేష‌న్‌లో మ‌హిళ‌పై అత్యాచార ఘ‌ట‌న అత్యంత బాధాక‌రమని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని అన్నారు. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సీరియ‌స్‌గా తీసుకున్నారని పేర్కొన్నారు. నిందితుల‌కు క‌ఠిన శిక్ష ప‌డే వ‌ర‌కు తమ ప్ర‌భుత్వం వ‌దిలిపెట్ట‌ద్దన్నారు. పోలీసులు ఇప్ప‌టికే ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. జిల్లా ఎస్పీతో, ఆస్ప‌త్రి అధికారుల‌తో మాట్లాడామన్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చూడాల‌ని రేప‌ల్లె ఆస్ప‌త్రి అధికారుల‌ను ఆదేశించినట్లు తెలిపారు. ప్ర‌స్తుతం బాధితురాలు వైద్య సిబ్బంది ప‌ర్యవేక్ష‌ణ‌లో ఉన్నారని చెప్పారు. ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందన్నారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి మా ప్ర‌భుత్వం అన్ని విధాలా అండ‌గా ఉంటుందని హామీ ఇచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube