మైనర్ బాలికపై లైంగికదాడి

మైనర్ బాలికపై లైంగికదాడి

1
TMedia (Telugu News) :

మైనర్ బాలికపై లైంగికదాడి
టి మీడియా,జూన్15,నిజామాబాద్‌: నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై కామాంధుడు లైంగికదాడికి పల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు (17 ఏండ్లు) గత నెల 31న భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక దవాఖానలో చేర్పించారు. 14 రోజుల చికిత్స అనంతరం కోలుకున్న ఆమె అసలు విషయం బయటపెట్టింది.

Also Read : కూలీలతో కలిసి గుంటలు తీసిన మంత్రి ఎరబెల్లి

ప్రేమించిన వ్యక్తే తన ఆత్మహత్యా యత్నానికి కారణమని, అతడు తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు వెల్లడించింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నామని చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube