భార్యను పుట్టింటికి పంపించి..

భార్యను పుట్టింటికి పంపించి..

0
TMedia (Telugu News) :

భార్యను పుట్టింటికి పంపించి.. క‌న్న‌ కూతురిపై కీచ‌క తండ్రి అత్యాచారం 💥

కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు వావివరుసలు మరిచిపోయి త‌ల్లి, చెల్లి, ఆక‌రికి కూతురుని కూడా వ‌ద‌ల‌డం లేదు…మ‌హిళ‌ల‌కు ఎక్క‌డా ర‌క్ష‌ణ లేకుండాపోతుంది.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. క‌న్న కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు… కూతురిపై కన్నేసిన ఆ కామాంధుడు.. భార్యను పుట్టింటికి పంపించి.. నోరు నొక్కి రెండుసార్లు కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.. బాధితురాలు తన సోదరుడికి ఈ విషయం చెప్పడంతో తండ్రి నీచ‌మైన‌ బుద్ధి బ‌య‌ట‌ప‌డింది. ఈ దారుణం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని చోటుచేసుకుంది.

Also Read:  కేసిఆర్ గారి పథకాలతో రైతు ఇంట నిజమైన సంక్రాంతి

వివ‌ర్లాలోకి వెళితే..

బంజారాహిల్స్‌ ప్రాంతంలో నివసించే ఆటోడ్రైవరు భార్యకు కొన్నాళ్లుగా ఆరోగ్యం బాగా లేదు. దీంతో కొద్దిరోజుల క్రితం ఇంటికొచ్చిన సోదరుడితో కలిసి పిల్లలను తీసుకొని వెళ్లాలని నిర్ణయించుకొంది. అయితే కుమార్తెను, ఇద్దరు కుమారులను తనవద్దనే ఉంచుకుంటానని భర్త చెప్పడంతో ఆమె సోదరుడితో కలిసి వెళ్లింది.ఈనెల 9న యథావిధిగా ఇంటికొచ్చిన తండ్రి అర్ధరాత్రి దాటిన తరువాత 15 ఏళ్ల కుమార్తె నోరు నొక్కి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని మరుసటి రోజు తన తమ్ముడికి చెప్పింది. వెంటనే వారిద్దరూ కలిసి మహబూబ్‌నగర్‌లో ఉన్న తల్లి వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పారు. విషయం విన్న తల్లి ఒక్కసారిగా షాక్ గురయ్యింది.వెంటనే తేరుకుని శుక్రవారం నగరానికి వచ్చి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితునిపై ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అతనిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube