రోడ్డు ప్రమాదంలో అరుదైన పునుగు పిల్లి మృతి

రోడ్డు ప్రమాదంలో అరుదైన పునుగు పిల్లి మృతి

0
TMedia (Telugu News) :

రోడ్డు ప్రమాదంలో అరుదైన పునుగు పిల్లి మృతి

టీ మీడియా, డిసెంబర్ 4, మహానంది : అంతరించిపోతున్న ఎంతో అరుదైన జాతికి చెందిన పునుగు పిల్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. నంద్యాల గిద్దలూరు జాతీయ రహదారి నల్లమల అడవి ప్రాంతం పచ్చర్ల సమీపంలో ఓ పునుగు పిల్లి రోడ్డుపై మృతిచెంది ఉండడాన్ని అటవి శాఖ సిబ్బంది గుర్తించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆ పునుగుపిల్లి మృతి చెందింది. ఈ విషయం తెలిసిన చలమ ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ ఈశ్వరయ్య, డిఆర్ఓ రాజు, గార్డు రామారావు ఘటనా స్థలానికి చేరుకొని, జరిగిన ప్రమాదాన్ని పరిశీలించి, పునుగు పిల్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా చలమ ఫారెస్ట్ రేంజ్ ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రతినిత్యం ఈ రహదారి యందు వన్యప్రాణులు తిరిగే ప్రాంతం కావడంతో, వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలంటూ తెలిపారు.కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి అభిషేకంలో టీటీడీ పునుగుపిల్లి తైలాన్ని ఉపయోగించిన సంగతి తెలిసిందే.ఇలాంటి అరుదైన జాతులు ఇలా రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతుండటంపై శ్రీవారి భక్తులు, ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తంచేశారు.

Also Read : ఇది కాంగ్రెస్‌ ఓటమి, ప్రజలది కాదు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube