శివలింగంపై రామబాణం గుర్తున్న అరుదైన ఆలయం..

శివలింగంపై రామబాణం గుర్తున్న అరుదైన ఆలయం..

0
TMedia (Telugu News) :

శివలింగంపై రామబాణం గుర్తున్న అరుదైన ఆలయం..

లహరి, ఫిబ్రవరి 17, రంగారెడ్ది జిల్లా : మహాశివరాత్రికి శివాలయాలు అన్నీ భక్తులతో కళకళలాడిపోతుంటాయి. శివయ్య నామస్మరణతో మారుమోగిపోతుంటాయి. ఉపవాసాలు..శివయ్యకు అభిషేకాలు ఇలా భక్తులు శివారాధనలో మునిగితేలుతుంటారు. అటువంటి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివయ్యకు..శ్రీరాముడికి ఉన్న ఓ అపురూపమైన అరుదైన శివాలయం గురించి తెలుసుకుందాం..శివలింగంపై రామబాణం గుర్తు ఉన్న అరుదైన ఆలయం ఈ శివాలయం. అంతేకాదు ఈ శివాలయంలో జోలె పట్టుకుని వేడుకుంటే ఎంత కష్టమైన ఇట్టే మాయం అయిపోతుందని భక్తులు చెబుతుంటారు. అలా ఎంతోమంది తమ బాధలు చెప్పుకుని సహాయం చేయమని తమ కష్టాన్ని పోగొట్టమని శివయ్యను వేడుకుంటుంటారు. అటువంటి శివాలయం ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలోనే ఉంది. రంగారెడ్ది జిల్లా షాద్‌నగర్‌ సమీపంలోని రాయికల్ గ్రామంలోని పంచముఖగుట్టపై ఉన్న శివాలయంలో ఉన్న లింగాన్ని త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరాముడు ప్రతిష్ఠించాడని చెబుతుంటారు. శ్రీరాముడు ఈ లింగాన్ని ప్రతిష్టాడు అనటానికి గుర్తుగా శివలింగంపై రామబాణం గుర్తు ఉంటుంది. ఈ ఆలయంలో శివయ్య రామలింగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.శ్రీ రామచంద్రుడే ప్రతిష్ఠించాడంతో రామలింగేశ్వరుగా పేరొందాడు శివయ్య. శ్రీరాముడు ప్రతిష్టంటంతో ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఏర్పడి ఉత్తర రామేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. లంకాధిపతి రావణాసురని సంహరించిన తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వెళ్తూ దండకారణ్య ప్రాంతమైన రామేశ్వరంలోని బదిరీ వృక్షం కింద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసారని చెబుతుంటారు. కానీ సాక్షాత్తు శ్రీమన్నారుయుడి అవతారమైన శ్రీరాముడే దేవాది దేవుడైనా..న శివయ్యను ప్రతిష్టించినా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ శివలింగం వందల ఏళ్లు భూగర్భంలోనే ఉండిపోయిందట.

Also Read : మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉంటున్నారా.?

రామేశ్వరం గుట్టల మధ్య మాణిక్య ప్రభువు శిష్యుడైన నరసింహారాయులు తపస్సు చేస్తుండుగా ఆయన కలలో రామలింగేశ్వరుడు దర్శన మిచ్చి.. బదిరీ వృక్షం కింద శివలింగం ఉందనీ, దాన్ని బయటకు తీసి పూజలు చేయమని చెప్పాడట..దీంతో ఆయన ఆ అద్భుత శివలింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి పూజలు చేశాడని ఆలయ నిర్వహకులు చెబుతారు. ఈ శివలింగానికి మరో ప్రత్యేకత ఏమంటంటే ఈ లింగం ప్రతి ఏటా పెరుగుతుందంటారు. దానికి నిదర్శనంగా శివలింగం చుట్టూ పగుళ్లు ఏర్పడుతుంటాయట.ఈ ఆలయం షాద్‌నగర్ ఎన్‌హెచ్ 44 నుంచి రాయకల్ గ్రామం 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాయకల్ గ్రామం నుంచి పంచముఖ గుట్ట రామేశ్వరానికి 4 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. మహాశివరాత్రి పర్వదినం రోజున ఈ ఆలయంలో జోలెపట్టి వేడుకుంటే ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అలా ఎంతోమంది శివరాత్రి రోజున జోలెపట్టి తమ కష్టాలు తీర్చమని శివయ్యను వేడుకుంటారు. ప్రతీ అమావాస్య, పౌర్ణమి రోజులలో ఈ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతుంటాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube