టీచ‌ర్ల‌ను నియ‌మించాల‌ని ర‌హ‌దారిపై బైఠాయించిన విద్యార్థులు

టీచ‌ర్ల‌ను నియ‌మించాల‌ని ర‌హ‌దారిపై బైఠాయించిన విద్యార్థులు

1
TMedia (Telugu News) :

టీచ‌ర్ల‌ను నియ‌మించాల‌ని ర‌హ‌దారిపై బైఠాయించిన విద్యార్థులు

టీ మీడియా, నవంబర్ 12, పంజాబ్ : టీచ‌ర్ల‌ను నియ‌మించాల‌ని డిమాండ్ చేస్తూ పంజాబ్‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు చెందిన విద్యార్థులు జాతీయ ర‌హాదారిపై బైఠాయించారు. విద్యార్థులు దాదాపు రెండు గంట‌ల పాటు ధ‌ర్నా చేశారు. పంజాబ్‌లోని మొగ సిటీలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో సైన్స్ టీచ‌ర్ల‌ పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయి. దాంతో, తాత్కాలికంగా అయినా కొత్త టీచ‌ర్ల‌ని నియ‌మించాల‌ని విద్యార్థులు ఎన్నిసార్లు అడిగినా యాజ‌మాన్యం స్పందించ‌లేదు. దాంతో, విద్యార్థులు శ‌నివారం జాతీయ ర‌హాదారిపై ధ‌ర్నాకు దిగారు. దాంతో, వాహ‌నాలు ఎక్క‌డికక్క‌డ నిలిచిపోయాయి. ఈ విష‌యం భాఘాపురాణా ఎమ్యేల్యే అమృత్‌పాల్ సింగ్ సుఖానంద్ (ఆమ్ ఆద్మీ పార్టీ) కు తెలిసింది.

Also read : హిమాచల్‌లో ఓటేసిన 105 ఏండ్ల బామ్మ

ఆల‌స్యం చేయ‌కుండా సైన్స్ టీచ‌ర్ల‌ను నియ‌మించాల‌ని ఆయ‌న‌ ప్రిన్సిపాల్‌ని ఆదేశించారు. అంతేకాదు ఆ టీచ‌ర్ల జీతం ఖ‌ర్చు తానే భ‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు. దాంతో, స్కూల్‌ యాజ‌మాన్యం తాత్కాలికంగా న‌లుగురు ప్రైవేట్ టీచ‌ర్ల‌ను తీసుకుంది. కొత్త టీచ‌ర్ల‌ను నియ‌మించ‌డంతో విద్యార్థులు ధ‌ర్నా ముగించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube