చేతి లోకి మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్ఎస్‌కు రాథోడ్‌ బాపురావు గుడ్‌బై

0
TMedia (Telugu News) :

చేతి లోకి మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే

-బీఆర్ఎస్‌కు రాథోడ్‌ బాపురావు గుడ్‌బై

టీ మీడియా, అక్టోబర్ 17,హైదరాబాద్:ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు రాథోడ్ బాపురావు కాంగ్రెస్ పార్టీ తీర్థంపుచ్చుకోనున్నారు.హైదరాబాదులోని గాంధీభవన్ లో పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కలిసి చ‌ర్చ‌లు జ‌రిపారు.. . బిఆర్ఎస్ పార్టీ నుండి రెండుసార్లు బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో తనను కాదని నేరేడిగొండ జడ్పిటిసి అనిల్ జాదవ్ కు బి ఫారం ఇవ్వడం పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది.గతంలోకేటీఆర్పిలిపించిసముదాయించినప్పటికీటికెట్ఇవ్వకపోవడాన్నిజీర్ణించుకోలేకపోయారు..

Also Read : మనస్తాపంతో ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య..

తన క్యాడర్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్ పార్టీ లోకి చేరే విషయంపై నిర్ణయం తీసుకున్నారు.ఈ నేప‌థ్యంలోనే హైద‌రాబాద్ లో రేవంత్ రెడ్డి ని క‌లిసి పార్టీ చేరిక‌పై మంత‌నాలు జ‌రిపారు.. . బోథ్ ఎమ్మెల్యే టికెట్ పై కాంగ్రెస్ పార్టీ హామీ ల‌భించ‌డంతో రేపు కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్లు స‌మాచారం .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube