రేషన్ కార్డుల దరఖాస్తులను దృష్టిలో ఉంచుకోవాలి

ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

0
TMedia (Telugu News) :

రేషన్ కార్డుల దరఖాస్తులను దృష్టిలో ఉంచుకోవాలి

– ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

టీ మీడియా, డిసెంబరు 27, వనపర్తి బ్యూరో : ఈనెల 28 నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమంలో తీసుకునే 6 గ్యారంటీల దరఖాస్తులతో పాటు అదనంగా రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులను సైతం తీసుకోవాలని, పార్టీల కతీతంగా దరఖాస్తుల స్వీకరణ జరగాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ కేంద్రం వద్ద అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘరెడ్డి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లారు.ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం పై రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు, ఉమ్మడి జిల్లా ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సు ఆయన మాట్లాడారు.వనపర్తి నియోజకవర్గ పరిధిలో చాలావరకు రేషన్ కార్డుల సమస్య ఉందని 6 గ్యారంటీ దరఖాస్తుల తో పాటు మిగతా సమస్యలకు సంబంధించిన దరఖాస్తులకు సైతం వీటితోపాటు దరఖాస్తుల స్వీకరణ జరిగితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read : ఆరు గ్యారంటీల ద‌ర‌ఖాస్తు ప‌త్రాన్ని ఆవిష్క‌రించిన

ఇందుకు సానుకూలంగా స్పందించిన ఇంచార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ గ్రామాల్లోని దరఖాస్తుల స్వీకరణ కేంద్రం వద్ద ఇతర సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సైతం తీసుకునేందుకు ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసే విధంగా చూడాలని, కౌంటర్ల వద్ద ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా తగిన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube