బియ్యం కావాలా.. పైసలా

-రేషన్ డీలర్ల దందా

1
TMedia (Telugu News) :

బియ్యం కావాలా.. పైసలా

-రేషన్ డీలర్ల దందా

టీ మీడియా, అక్టోబర్ 18, ముత్తారం : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో పేదోడికి పట్టెడన్నం పెట్టాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టిన రేషన్ బియ్యం పథకం పక్కదారి పడుతుంది.. బియ్యం పంపిణీ చేసేటీ రేషన్ డీలర్లు ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. రేషన్ సరుకుల కు వెళ్లే ప్రజలను బియ్యం కావాలా పైసలు కావాలని అడిగి బియ్యం కావాలనే వారికి బియ్యం ఇస్తూ వద్దన్నవారికి ఐదు రూపాయలు లేదా ఆరు రూపాయలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో కిలో బియ్యాన్ని కి 22 రూపాయలు ఖర్చు చేస్తూ పేదలకు అందించాలని కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుండగా డీలర్లు లబ్ధిదారులకు ఐదు నుండి ఆరు రూపాయల వరకు ఇస్తున్నారు. లబ్ధిదారుల నుండి తీసుకున్న బియ్యాన్ని దళారులకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. మధ్య దళారీలు తీసుకున్న బియ్యాన్ని ట్రాలీ లారీల ద్వారా మహారాష్ట్ర కు తరలించి ఒక్కో కిలో బియ్యాన్ని 22 రూపాయలకు అమ్ముకుంటున్నారు.

Also Read : కోటి రూపాయ లు స్వాధీనం

ఒక కింటల్ బియ్యం అమ్మితే సుమారు రెండు వేల రూపాయల వరకు లాభం వస్తుండగా ఒక్క ట్రాలీ బండి అమ్ముతే రూ. లక్ష వరకు సంపాదిస్తున్నారు. కంచె చేను వేస్తున్న చందంగా బియ్యం పంపిణీ చేసే డీలర్లతో పాటు మరి కొంతమంది దళారులు కుమ్మకై రేషన్ బియ్యం దందా కొనసాగిస్తున్నట్లు పలువురు విమర్శిస్తున్నారు ఈ దందా గత ఐదేళ్ల గా కొనసాగిస్తూనే ఉన్నారు పర్యవేక్షించవలసిన అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు మామూలు దండుకుని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మామూలు పుచ్చుకోకుంటే ఎందుకు పర్యవేక్షించడం లేదని అక్రమ బియ్యం దందాను ఎందుకు అదుపు చేయలేకపోతున్నారని ప్రశ్నించే గొంతుక ను మామూళ్ల మత్తులో మభ్యపెడుతున్నారని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు బియ్యం అక్రమ దందా కొనసాగిస్తున్న డీలర్ల తో పాటు మరికొంతమంది దళారుల పై చర్య తీసుకొని అక్రమ బియ్యం దందాను నిలిపివేయాలని పలువురు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube