రేషన్ డీలర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి

రేషన్ డీలర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి

1
TMedia (Telugu News) :

రేషన్ డీలర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి
టీ మీడియా, ఏప్రిల్ 22, రామకృష్ణాపూర్:మండలంలోని రేషన్ డీలర్లు ప్రభుత్వ నియమ బంధనలు తప్పక పాటించాలి అని మందమర్రి తహశీల్దార్ సంపతి శ్రీనివాస్ అన్నారు. గురువారం మందమర్రి తహశీల్దార్ కార్యాలయం లో డీలర్ లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి నెల రేషన్ బియ్యం 1వ తేదీ నుండి 15 వ తేదీ వరకు అందించాలని అన్నారు. ప్రభుత్వం బియ్యం సరఫరా ఆలస్యం అయితే ,బియ్యం పంపిణీ కి మరింత సమయం ఇస్తుందని అన్నారు.

Also Read : అఖిలపక్షం ఆధ్వర్యంలో త్వరలో నిరసన దీక్ష

డీలర్లు సంబంధిత రికార్డ్ లు నిర్వహించాలని అన్నారు.సమావేశానికి గైర్హాజరు అయిన ఎనిమిది మంది డీలర్ల కు 500 రూపాయ ల చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. ప్రతినెలాగోదాములనుండిడీలర్లకుబియ్యంవచ్చేటవుడుక్వింటాళ్లకొద్దీతక్కువవస్తున్నాయనివాపోయారు.స్పందించిన తహశీల్దార్ శ్రీనివాస్ సంబంధిత అధికారులకు తెలియపరిచి సమస్య పరిష్కారిస్తానని అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube