రేషన్ నగదు బదిలీ వాయిదా

మంత్రి నాగేశ్వరరావు

1
TMedia (Telugu News) :

రేషన్ నగదు బదిలీ వాయిదా: మంత్రి నాగేశ్వరరావు

టి మీడియా, ఎప్రిల్ 23,అమరావతి:  రేషన్‌కార్డుదారులకు నగదు బదిలీ పథకాన్ని వాయిదా వేసినట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. యాప్‌లో సాంకేతిక లోపం వల్ల ప్రస్తుతానికి నగదు బదిలీని నిలిపివేశామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు.
నగదు బదిలీపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే తెలియజేస్తామని ఆయన అన్నారు.

Also Read : కౌన్సిలర్ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

రైతుల కల్లాల దగ్గరకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని, జిల్లా యూనిట్‌గా తీసుకుని రైతులకు దగ్గరగా ట్రాన్స్‌పోర్ట్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు పడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కారుమూరి స్పష్టం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube