రాష్ట్రం దాటుతున్న రేషన్ బియ్యం

రాష్ట్రం దాటుతున్న రేషన్ బియ్యం

3
TMedia (Telugu News) :

రాష్ట్రం దాటుతున్న రేషన్ బియ్యం

 

టి మీడియా, అక్టోబర్,8, ఆదిలాబాద్ :జిల్లా బోథ్ మండలంలోని సోనాలలో రేషన్ బియ్యం వచ్చిందంటే చాలు సోనాల గల్లీలల్లో ఆటో లతో, మాక్స్ లతో ఇంటింటికి తిరుగుతూ అక్రమంగా రేషన్ బియ్యాన్ని కొంటూ యదేచ్ఛగా మహారాష్ట్ర బార్డర్ దాటిస్తున్నారు, నేడు సోనాల గ్రామంలో, ఓంకార్ అనే దళారి రేషన్ బియ్యాన్ని కేవలం ఎనిమిది రూపాయలకు కొని అక్రమంగా, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని దాటిస్తున్న క్రమంలో అటో లో ఉన్న బియ్యాన్ని కెమెరాలో బంధించి అధికారులకు పంపిన స్థానిక డిప్యూటీ తహశీల్దార్ పట్టించుకోలేదు.

Also Read : లొంగిపోయిన మావోయిస్టు ఉషారాణి

ఇంత యదేచ్ఛగా రాష్ట్రం దాటి పోతుంటే, అధికారులు ఏం చేస్తున్నారు, సంభందిత అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారనీ స్థానికులు మండిపడుతున్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో, చెక్ పోస్ట్ వద్ద ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యమే. అదేవిధంగా వెంటనే సివిల్ సప్లయర్, శ్యాం సుందర్ గారికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ వారు స్పందించలేరు.. ఇలాంటి అధికారులపై వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube