‘బుల్‌బుల్ త‌రంగ్’ ప్రోమో విడుద‌ల‌..

ఆక‌ట్టుకుంటున్న రవితేజ‌ స్టెప్స్

1
TMedia (Telugu News) :

‘బుల్‌బుల్ త‌రంగ్’ ప్రోమో విడుద‌ల‌.. ఆక‌ట్టుకుంటున్న రవితేజ‌ స్టెప్స్
టీ మీడియా, ఏప్రిల్ 9 , సినిమా:మాస్‌రాజ ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుసగా సినిమాల‌ను చేస్తూ తీరిక లేకుండా షూటింగ్‌ల‌లో పాల్గొంటున్నాడు. ఏడాదికి రెండు సినిమాల‌ను విడుద‌ల‌ చేసే విధంగా ర‌వితేజ ప్లాన్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న చేతిలో నాలుగు సినిమాలున్నాయి. గ‌త‌నెల ‘ఖిలాడీ’తో భారీ ఫ్లాప్‌ను అందుకున్న మాస్‌రాజ ఈ సారి ‘రామారావు ఆన్ డ్యూటీ’తో ఎలాగైనా మంచి హిట్టు సాధించాల‌ని క‌సితో ఉన్నాడు. శ‌ర‌త్ మండ‌వ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌య‌మ‌వుతున్నాడు. ఇటీవ‌లే స్పెయిన్‌లో రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. అయితే తాజాగా ఈ చిత్రంలోని ఫ‌స్ట్ సింగిల్‌ ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

Also Read : ఆమ్ ఆద్మీ కి ఎదురుదెబ్బ‌

బుల్ బుల్ త‌రంగ్.. బుల్ బుల్ త‌రంగ్ అంటూ సాగే ఈ పాట‌ను సిద్ శ్రీ రామ్ ఆలపించ‌గా రాకేందు మౌళి సాహిత్యం అందించాడు. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ పాట‌, ఫుల్ లిరిక‌ల్ వీడియోను శ్రీరామ‌న‌వ‌మీ సంద‌ర్భంగా ఏప్రిల్10న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో దివ్యాంశ కౌషిక్, రాజిషా విజ‌య‌న్ హీరోయిన్లుగా న‌టించారు. చాలా కాలం త‌ర్వాత సీనియ‌ర్ న‌టుడు వేణు తోట్టెంపూడి ఈ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. శ్రీ ల‌క్ష్మివెంక‌టేశ్వ‌రా సినిమాస్, ఆర్‌టి టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ల‌పై సుధాక‌ర్ చెరుకూరితో కలిసి ర‌వితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ చిత్రంలో ర‌వితేజ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 17న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube