తప్పుడు ప్రచారం కాదు ఉన్న వాస్తవాలు అని తెలుసుకోవాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా,అక్టోబర్ 31, మధిర:

జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు టిఆర్ఎస్ ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేసేముందు వాస్తవాలు తెలుసుకోవాలని మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు అన్నారు.
అనంతరం ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు మాట్లాడుతూ….
రాష్ట్ర ప్రభుత్వం అందించే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల మంజూరు అధికారం స్థానిక ఎమ్మెల్యే గా మీకు ఉంది అలాంటి అప్పుడు మీరు దరఖాస్తు చేసుకున్న ఫైల్స్ మీద నెలల తరబడి సంతకాలు పెట్టకుండా పెండింగ్ లో పెట్టుకోవడం అదేవిధంగా మంజూరు అయిన చెక్కులను టైం అయిపోయే ముందు వచ్చి ఇవ్వడం ఏంటి అని చెక్కుల కోసం లబ్ధిదారులు, గర్భిణీ స్త్రీలను, చంటి పిల్లల తల్లలను వేచి చూడాల్సిందే అన్నట్లుగా ప్రవర్తించడం సరి కాదు అని
అలా కాకుండా మీకు కుదరని పక్షంలో స్థానిక ఎన్నికల్లో ప్రజా తీర్పుతో గెలిచిన సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఉన్నారు వారి ద్వారా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయవచ్చు గా అని అడిగితే మా నాయకులు మీద, పార్టీ క్యాడర్ మీద, లబ్ధిదారుల మీద భట్టి అసహనం వ్యక్తం చేస్తూ గొడవ సృష్టించిన మాట వాస్తవం కాదా అని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పల్లెల్లో రైతాంగానికి రైతు బంధు,

రైతు బీమా,రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్ ,పండించిన పంటను ప్రభుత్వం నేరుగా రైతు దగ్గరకు వెళ్లి కొనడం అలానే పింఛన్లు భారీగా పెంచి ఎన్ని ఇబ్బందులు ఉన్న వారికి టైం కి ఇవ్వడం, దళితులకు దళిత బందు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లాంటి అద్భుత కార్యక్రమాలు తో పాటుగా గ్రామాల్లో పట్టణాల మాదిరిగా ప్రతి పంచాయితీ కి చెత్త సేకరణ కోసం ట్రాక్టర్, ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం ఏర్పాటు, డంపింగ్ యార్డ్ లాంటివి ఏర్పాటు చేయడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న మాట వాస్తవం కాదా అని అన్నారు.

ఈ సమావేశంలో మండల టీ ఆర్ యస్ పార్టీ అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు,ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు,పట్టణ పార్టీ కార్యదర్శి అరిగే శ్రీనివాసరావు,రైతు బంధు మండల కన్వీనర్ చావా వేణు, మండల పార్టీ కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, మున్సిపల్ ప్లోర్ లీడర్ అప్పారావు, సొసైటీ చైర్మన్ కటికల సీతారామిరెడ్డి, సోషల్ మీడియా ఇంచార్జ్ తాళ్ళూరి హరీష్ బాబు తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube