రాయల్‌‌ ఎన్‌‌ఫీల్డ్‌‌ బైక్‌‌ బయర్లకు బంపర్ ఆఫర్

రాయల్‌‌ ఎన్‌‌ఫీల్డ్‌‌ బైక్‌‌ బయర్లకు బంపర్ ఆఫర్

0
TMedia (Telugu News) :

 

 

bullet
bullet

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: రాయల్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ బైక్‌‌‌‌‌‌‌‌లను కొనేవారికి ఎల్‌‌‌‌‌‌‌‌ & టీ ఫైనాన్స్ తక్కువ వడ్డీకే లోన్లను ఆఫర్ చేస్తోంది. 7.99 శాతం నుంచి వడ్డీని వేస్తామని అంటోది. అంతేకాకుండా కస్టమర్లు వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను తమ దగ్గర హైపోథికేట్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. హైపోథికేషన్ అంటే వెహికల్ లోన్ తీసుకునేటప్పుడు ఆ వెహికల్ వెంటనే బయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరు మీదకు రాదు. లోన్ అంత తీర్చేంత వరకు ఆ వెహికల్‌‌‌‌‌‌‌‌పై హక్కులు ఫైనాన్స్ ఇచ్చిన వారికి ఉంటాయి. రాయల్ ఎన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను ఎల్ అండ్‌‌‌‌‌‌‌‌ టీ ఫైనాన్స్ ద్వారా కొన్నవారికి ఈ బాధ ఉండదు. ‘వెల్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ 2022’ కింద ఈ ఆఫర్లను ఎల్ అంట్ టీ ఫైనాన్స్ ప్రకటించింది. లోన్‌‌‌‌‌‌‌‌ను కేవలం మూడు నిమిషాల్లోనే అప్రూవ్ చేస్తామని, బైక్ కాస్ట్‌‌‌‌‌‌‌‌లో 90 శాతాన్ని లోన్‌‌‌‌‌‌‌‌గా ఇస్తామని, ఈ లోన్‌‌‌‌‌‌‌‌ను కూడా 4 ఏళ్లలో తీర్చొచ్చని కంపెనీ చెబుతోంది. ఎల్ & టీ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌తో పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ కుదుర్చుకోవడం వల్ల మరింత మందికి తమ బైకులు అందుబాటులోకి వస్తాయని రాయల్ ఎన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీ గోవిందరాజన్ అన్నారు. కంపెనీ డీలర్ల దగ్గర లేదా ఎల్‌‌‌‌‌‌‌‌& టీ ఫైనాన్స్ బ్రాంచు ఆఫీస్‌‌‌‌‌‌‌‌ల దగ్గర ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను కన్జూమర్లు పొందొచ్చు. లేదా కంపెనీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ అయిన www.ltfs.com లోకి వెళ్లి ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌ కింద లోన్​కు అప్లై చేసుకోవచ్చు. క్లాసిక్‌‌‌‌‌‌‌‌ 350, ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 650, కాంటినెంటల్‌‌‌‌‌‌‌‌ జీటీ 650 ట్విన్స్‌‌‌‌‌‌‌‌, హిమాలయన్ వంటి బైక్‌‌‌‌‌‌‌‌లను రాయల్ ఎన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ అమ్ముతోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube