మహానందిశ్వరుని సేవలో ఆర్ అండ్ బి మంత్రి దంపతులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా , నవంబర్ 30, మహానంది:

మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి మహానందిశ్వర స్వామి వారిని మంగళవారం ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాలశాఖ మంత్రి శంకర్‌ నారాయణ దంపతులు మహానందిశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆలయ కార్యనిర్వహణ అధికారి గంజి మల్లికార్జున ప్రసాద్‌ వారికి స్వాగతం పలికారు.
స్వామి వారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు.
అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల రూరల్‌ సిఐ రవీంద్ర, మహానంది ఎస్‌ఐ సిసి నాగార్జున్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

R&B Minister couple
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube