ఆర్బీఐఅనూహ్య నిర్ణయం రేపో పెంపు

రుణగ్రహీతలపై భారం

1
TMedia (Telugu News) :

ఆర్బీఐఅనూహ్య నిర్ణయం రేపో పెంపు

-రుణగ్రహీతలపై భారం
టీ మీడియా, మే 5,ముంబై : కేంద్ర బ్యాంక్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అత్యంత కీలకమైన రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఈ మేరకు బుధవారం ప్రకటించారు. తాజా పెంపుతో రెపో రేటు 4.40 శాతానికి చేరింది. రెపో రేటు పెంపు తక్షణమే అమల్లోకి ఆర్బీఐ గవర్నర్ వస్తుందని ఆయన స్పష్టం చేశారు. రెపో రేటు పెంపునకు మోనిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. సర్దుబాటు వైఖరిని ఉపసంహరించుకున్నట్టు వెల్లడించారు. మరోవైపు cash reserve ratio (సీఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు వెల్లడించింది. తాజా పెంపుతో 4.50 శాతానికి పెరిగిందని శక్తికాంత్ దాస్ చెప్పారు. ఈ ప్రభావంతో రూ.83,711.55 కోట్ల నగదు ఆర్థిక వ్యవస్థ నుంచి ఉపసంహరణ జరుగుతుందని వివరించారు.

Also Read : ఓయూలో రాహుల్‌ పర్యటనకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

సీఆర్‌ఆర్ పెంపు మే 21 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుందని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థలో నిరంతరాయంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని శక్తికాంత్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రెపో రేటును చివరిసారిగా మే 2020లో పెంచారు. అప్పటి నుంచి ఇప్పటివరకు యథాతథంగా కొనసాగిన విషయం తెలిసిందే.పెరగనున్న ఈఎంఐలు..రెపో రేటు పెంపుతో రుణ గ్రహీతలపై ఈఎంఐల భారం పెరగనుంది. రుణాలపై వడ్డీ రేట్లను బ్యాంకులు పెంచనున్నాయి. ఫలితంగా బ్యాంకు ఖాతాదారుల గృహ, వాహన రుణాలపై EMI లు మరింత పెరగనున్నాయి. బ్యాంకుల రుణాలు ఆర్బీఐ వడ్డీ రేట్లతో ముడిపడివుండడమే ఇందుకు కారణం. కొత్త రుణాలు తీసుకోవాలనుకునేవారిపైనా ఈఎంఐల భారం తప్పదు. రుణాలపై వడ్డీ రేట్లను త్వరలోనే బ్యాంకులు పెంచే అవకాశం ఉంది. వాస్తవానికి రెపో రేటు పెంపును రుణగ్రహీతలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ప్రతికూలంగా భావించవచ్చు. ఎందుకంటే రుణాలపై వడ్డీ రేట్లు పెరగుతాయి. పర్యవసానంగా ఈఐఎంలు పెరుగుతాయి. ఈ ప్రభావం గృహరుణాలతోపాటు వాహన లేదా వ్యక్తిగత రుణాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

Also Read : ఓయూలో రాహుల్‌ పర్యటనకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

రెపో రేటు అంటే ఏమిటి.. ఎందుకంత కీలకం..కమర్షియల్ బ్యాంకుల వద్ద ప్రతిసారీ సరిపడా నిధులు ఉండవు. అలాంటి సమయాల్లో ఆర్బీఐ వద్ద రుణంగా నిధులను తీసుకుంటాయి. అయితే ఆర్బీఐ కొంత వడ్డీ రేటుతో బ్యాంకులకు రుణాలిస్తుంది. ఆర్బీఐకి కమర్షియల్ బ్యాంకులు చెల్లించే ఈ వడ్డీ రేటునే రెపో రేటు అంటారు. అయితే ఈ వడ్డీ రేటు పెంపు లేదా తగ్గింపు లేదా యథావిథిగా కొనసాగించడం ఆర్బీఐ నిర్ణయంపై ఆధారపడివుంటుంది. ఆర్థిక వ్యవస్థపై నగదు ప్రభావం, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఆధారంగా ఆర్బీఐ మోనిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో రెపో రేటు ఆర్బీఐకి చాలా చాలా ముఖ్యమైనది. ఆర్బీఐ తీసుకునే నిర్ణయం కమర్షియల్ బ్యాంకుల రుణ రేట్లు ఆధారపడివుంటాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube