తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగానికి అంతా సిద్ధం

తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగానికి అంతా సిద్ధం

1
TMedia (Telugu News) :

తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగానికి అంతా సిద్ధం

టీ మీడియా, నవంబర్ 17, శ్రీహరికొట : దేశంలో తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగానికి అంతా సిద్ధమైంది. ఇప్పటివరకు ఇస్రో తయారుచేసిన రాకెట్లను ప్రయోగించడం మాత్రమే మనం చూశాం. కానీ మొదటిసారిగా ఓ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడానికి రెడీగా ఉంది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్ షార్‌ నుంచి ఈరోజు ఉదయం 11.30 గంటలకు ప్రయోగించనున్నారు.

Also Read : హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం.. 4.1 తీవ్రత

హైదరాబాద్ కి చెందిన స్పేస్ స్టార్టప్ అయిన స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ఈ రాకెట్‌కు విక్రమ్‌-ఎస్‌ అని నామరకణం చేశారు. కాగా, దీనిని ఈ నెల 12నే ప్రయోగించాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో శాస్త్రవేత్తలు వాయిదావేస్తూ వస్తున్నాయి. అయితే నవంబర్‌ 18న ఈ రాకెట్‌ను నింగిలోకి పంపించాలని తాజాగా నిర్ణయించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube