కొంపముంచిన కొటరీ లు

- భూ కబ్జాలు, సెటిల్ మెంట్లు

0
TMedia (Telugu News) :

కొంపముంచిన కొటరీ లు

– భూ కబ్జాలు, సెటిల్ మెంట్లు

– ప్రశ్నిస్తే కేసులు, దాడులు

– సంక్షేమ పధకాల ఎంపికలోనూ వారిదే పాత్ర

– కాంట్రాక్టులు వారి కనుసన్నల్లోనే

– జీరో నుండీ కోట్లకు ఎగభాకిన కొందరు

– ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ ఓటమీకి కారణాలు

టి మీడియా, డిసెంబర్ 4, ఖమ్మం జిల్లా బ్యూరో : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ 9 చోట్ల పరాజయం పొంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. కర్ణుడు చావు కు కారణాలు ఎన్ని ఉన్నా కాంగ్రెస్ గెలుపుకు బిఆర్ఎస్ అభ్యర్థుల చుట్టూ ఉన్న కోటరీలు కారణం అనేది విశ్లేషకులు అంటున్నారు. బిఆర్ఎస్ క్యాడర్ కూడా కోటరీ ల భాదితులుగా ఉన్నారు. బైటకు చెపితే వేధింపులు, బెదిరింపులకు పాల్పడిన వ్యవహారం అన్ని చోట్ల వేర్వేరు రూపాల్లో జరిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి కి చెందిన ఎమ్మెల్యే లు బిఆర్ఎస్ లో చేరడానికి భయం అనేది ప్రధాన కారణంగా ఉంది. బిఆర్ఎస్ లో చేరిన వారు ప్రత్యేకంగా ఆ పార్టీ లో గ్రూప్ గా వ్యవహరించారు. అప్పటికే పార్టీ లో ఉన్న వారిని వేరుగా చూసారు. బిఆర్ఎస్ గుర్తు పై గెలిచిన ఖమ్మం ఎమ్మెల్యే లాంటి వారు మంత్రి పదవి అడ్డం పెట్టుకొని తమ కోటరీ ద్వారా దందాలు చేసారు. భూ కబ్జాలకు కొదవ లేదు. కళ్యాణ లక్ష్మి, డబుల్ బెడ్ రూమ్, చివరకు ఆసరా ఫించన్ లు, బిసి, ఎస్సి సంక్షేమ పధకాలు, రైతు బజార్ లో షాప్ లు, రేషన్ షాప్ లు లాంటివి కేటాయింపు వెంట తిరిగే మనుషులు సూచించిన వారికీ మాత్రమే ఇవ్వడం, భారీ మొత్తాలు వసూళ్లు లాంటి అనేక ఆరోపణలు ఖమ్మం పరిధిలో ఉన్నాయి.

Also Read : తుఫాన్ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనండి

50 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలంను నగరంలో భూ కబ్జాదారులుగా పేరున్న కుటుంబం అంబేద్కర్ విగ్రహం పెట్టి ఆధీనం లో ఉంచుకుంటే వారికి అండ ఇచ్చి, కబ్జా స్థలం పై హక్కు కోసం మంత్రి హోదా లో పువ్వాడ అధికారుల పై వత్తిడి తెచ్చారని ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా ఆ స్థలం ఉద్యోగుల సొసైటీది. ఇటువంటివి అనేకం ఉన్నాయి. ఇదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది. మరో నియోజకవర్గం లో ఇటివల వరకు అరటిపళ్ళు అమ్ముకొని, క్రికెట్ బుకి గా పేరున్న వ్యక్తి ని వెంట వేసుకొని తిరిగి ఆయన చెప్పిందే వేదంగా 5 ఏళ్ళ లో వ్యవహారం చేయటం, ఎన్నికల్లో కూడా ఆయనే కీలక భూమిక పోశించారు. పోటీ నాటికె వ్యతిరేకత ఉన్న ఆయనకు కోటరీ ఓటమి కీ కారణం అయింది అనే అభిప్రాయం ఉంది. అశ్వారావుపేట పేట లో సంక్షేమ పధకాలు లో అవి నీతి బైట పడింది. షాడో ఎమ్మెల్యే గా బంధువు వ్యవహరించడం. కొంతమంది తనకు దగ్గరగా ఉండే వారికి మాత్రమే కాంట్రాక్ట్ లు,ఇతర లబ్దిలు లాంటివి ఆయన ఓటమీ కీ కారణం అనే అభిప్రాయం ఉంది. ఇక్కడ అక్రమ కేసులు, అసాంఘిక వ్యవహారాలు అక్కడి అభ్యర్థి కనుసన్నలలోనే జరిగాయి అనేది ఉంది. ఓటమీకి ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. పినపాక లో కేసులు, పొడు వివాదాలు, ప్రధాన ఐటిసి లో ఉద్యోగాల అమ్మకాలు, అక్రమ ఇసుక క్వారీలు లాంటి అనేక అంశలు అక్కడి అభ్యర్థి పై వ్యతిరేకం తేచ్చాయి.

Also Read : తుమ్మ ముల్లు కదా? బాగా గుచ్చుకుందా కెసిఆర్ ?

పాలేరు నియోజకవర్గం లో అభ్యర్థి చుట్టూ ఉన్న కేవలం 4 గురు వ్యక్తులు వ్యవహారం అభ్యర్థి కీ వ్యతిరేకం తెచ్చి ఓటమికి కాయం అయింది. ఖమ్మంలో నివాసం ఉంటూ అత్యంత ఖరీదు అయిన జీవితం ఈ నలుగురు మొత్తం పాలేరు నియోజకవర్గం పై పెత్తనం చేసారు. గతంలో పాలేరు లో గెలిచినప్పుడు ఆయన వెంట ఉన్న వీరు వ్యతిరేకంగా మారారు. బిఆర్ఎస్ లో ఉన్నపుడు తుమ్మల వర్గీయిల పై కేసులు లాంటివి బిఆర్ఎస్ అక్కడ ఓటమి కారణం అయింది. కోటరీ గా ఉన్న ఈ నలుగురు మాత్రం కోట్లకు పడగేత్తారు. మొత్తం మీద ఖమ్మం జిల్లాలో కోటరీ లు బిఆర్ఎస్ కొంపముంచాయి అన్నది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube